Saturday, July 11, 2026
News Navigation
Saturday, July 11, 2026
News Navigation

Breaking

Saturday, July 11, 2026
Home Andhra Pradesh ఏపీలో టెన్త్, ఇంటర్ పరీక్షలు షెడ్యూల్‌ విడుదల

ఏపీలో టెన్త్, ఇంటర్ పరీక్షలు షెడ్యూల్‌ విడుదల

by Satya
Botsa Satyanarayana

టెన్త్, ఇంటర్ పరీక్షలు మార్చిలోనే నిర్వహిస్తామని ఆంధ్రప్రదేశ్ విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. మార్చి 18 నుంచి మార్చి 30 వరకు 12 రోజుల పాటు పదో తరగతి పరీక్షలు జరుగుతాయని చెప్పారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 వరకు పరీక్ష జరుగుతుందని తెలిపారు. సుమారు 6 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారని వెల్లడించారు. ఇంటర్ పరీక్షలను మార్చి 1 నుంచి 15 వరకు నిర్వహిస్తామని బొత్స తెలిపారు. ఒకే రోజు రెండు పరీక్షలు ఉండవని ఒకరోజు ఫస్టియర్, మరో రోజు సెకండియర్ పరీక్ష ఉంటుందన్నారు. ఏపీలో ఎన్నికల నేపథ్యంలో విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా కాస్త ముందుగానే పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించామని మంత్రి బొత్స వివరించారు. పరీక్షలను సమర్థవంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. విద్యార్థులు పరీక్షలు బాగా రాసి, అందరూ పాస్ కావాలని బొత్స ఆకాంక్షించారు.

Advertisements

You may also like

Our Visitor

039595
Total views : 198654

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: