89
మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించడంపై ఆటో డ్రైవర్లు మండిపడుతున్నారు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు ఉపాధి కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని తెలంగాణ స్టేట్ ఆటో అండ్ టాక్సీ డ్రైవర్స్ యూనియన్ నేతలు కోరారు. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్ బస్ భవన్ ముందు గ్రేటర్ హైదరాబాద్ ఆటో, టాక్సీ డ్రైవర్స్ యూనియన్ ధర్నా చేపట్టారు. మహిళలకు ఫ్రీ బస్ స్కీమ్ ద్వారా తాము నష్టపోతున్నామని చెబుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని యూనియన్ నాయకులు వెంకట్ ఆవేదన వ్యక్తం చేశారు. ఓలా, ఊబర్, రాపిడ్ బైక్ ల అక్రమ వ్యాపారం వల్ల ఆటో డ్రైవర్స్ తీవ్రంగా నష్టపోయి రోడ్డున పడుతున్నారని తెలిపారు. తక్షణమే ప్రభుత్వం తమ ఉపాధి దెబ్బతినకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.