ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ తయారీ సంస్థ వినియోగదారులకి షాక్ ఇచ్చింది. ఓలా ఎస్1 ప్రో ధరను పెంచింది. ఇప్పుడు ఈ-స్కూటర్‌ను కొనుగోలు చేయడానికి మరో 10 వేలు ఎక్కువగా ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇంతకుముందు FAME II సబ్సిడీని తొలగించిన తర్వాత దీని ఎక్స్-షోరూమ్ ధర రూ. 1.29 లక్షలుగా ఉండేది. ఇప్పుడు అది రూ. 1.39 లక్షలకు పెరిగింది.
Ola S1 ప్రో స్పెసిఫికేషన్ గురించి మాట్లాడితే.. ఈ కొత్త స్కూటర్ పది రంగులలో వస్తుంది. Ola S1 ప్రో అనేది కంపెనీ S1 మోడల్ ప్రీమియం వేరియంట్. S1 ప్రో మోటార్ 5500 W శక్తిని ఇస్తుంది. వినియోగదారులు S1 ప్రో రెండు చక్రాలలో డిస్క్ బ్రేక్‌లతో వస్తుంది. S1 ప్రో గరిష్ట వేగం 115kmph అని కంపెనీ పేర్కొంది. Ola S1 ప్రో ఈ-స్కూటర్ క్రూయిజ్ కంట్రోల్, హిల్-హోల్డ్ సిస్టమ్, వాయిస్ అసిస్ట్ అంటూ మూడు రైడింగ్ మోడ్లతో వస్తుంది. S1 ప్రో బ్యాటరీ ఆరున్నర గంటల్లో పూర్తిగా ఛార్జ్ అవుతుంది.
ఓలా ఎస్1 ప్రో భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఈ-స్కూటర్ అని అందరికి తెలిసిందే. మార్చిలోనే ఎలక్ట్రిక్ స్కూటర్ల ధరలను పెంచాలని ఓలా ఎలక్ట్రిక్ సీఈవో సూచించారు. దీని తర్వాత Ola S1 ప్రో బుకింగ్‌ను పునఃప్రారంభిస్తున్నప్పుడు కంపెనీ ధరను 10 వేల రూపాయలు పెంచింది. అదే సమయంలో Ola త్వరలో MoveOS 2 OS స్కూటర్లని విడుదల చేయనుంది. ఈ ఏడాది జనవరిలో బుక్ చేసుకున్న వినియోగదారులకు కూడా పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. కంపెనీ నిర్ణయం ప్రకారం జనవరిలో బుకింగ్ చేసుకునే కస్టమర్లు కూడా కొత్త ధరను చెల్లించాల్సి ఉంటుంది. అదే సమయంలో తాజా బుకింగ్ S1 ప్రో కోసం మాత్రమే ఓపెన్ చేశారు.
Ola
నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో గిగ్ వర్కర్స్‌తో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. ప్రొఫెషనల్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి సీఎం రేవంత్ చీఫ్ గెస్ట్‌గా హాజరయ్యారు. ఎన్నికల ముందు గిగ్ అండ్ ప్లాట్ ఫార్మ్ వర్కర్లకు న్యాయం చేస్తానని రాహుల్ గాంధీ ఇచ్చిన హామీ మేరకు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి స్విగ్గి, జొమాటో, ఆటో డ్రైవర్లు, గిగ్ ప్లాట్ ఫార్మ్ కిందకు వచ్చే ఓలా, ఊబర్, ర్యాపిడో, పోర్టర్ తదితర కంపెనీలో పనిచేస్తున్న వర్కర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారి సమస్యలపై సీఎం రేవంత్ రెడ్డి చర్చిస్తున్నారు. అయితే మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచితంగా ప్రయాణ సౌకర్యాలు కల్పించటం వల్ల ఉపాధి కోల్పోయి ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో గిగ్ వర్కర్లు సీఎం రేవంత్‌కు వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా 4 లక్షల 20 వేల గిగ్ వర్కర్లు ఉండగా తమకి ఉద్యోగ భద్రత కల్పించాలని సీఎంను కోరినట్టు సమాచారం. రాజస్థాన్ తరహా గిగ్ ప్లాట్ ఫార్మ్ కార్మికుల సంక్షేమ బిల్లు తేవాలని వర్కర్లు సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. కాగా ఈ ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఎన్నికల హామీల్లో భాగంగా ఆరు గ్యారెంటీలను ప్రకటించారు. దీంతో తెలంగాణ సీఎం ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే రేవంత్ రెడ్డి మహాలక్ష్మి పథకాన్ని అమలులోకి తెచ్చారు. దీని ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలు ఉచిత బస్సు సౌకర్యాన్ని వినియోగించుకుంటున్నారు. అయితే ఈ పథకం ద్వారా ఆటో డ్రైవర్లు, ఉబర్, ఓలా సిబ్బంది ఉపాధి కోల్పోయారు. దీంతో వారంత మహాలక్ష్మి పథకాన్ని రద్దు చేయాలంటూ ఆందోళనలు చేపట్టి బస్ భవన్ ముట్టడికి యత్నించిన సంగతి తెలిసిందే. ఈక్రమంలో వారి పరిస్థితిని అర్థం చేసుకున్న సీఎం రేవంత్ రెడ్డి నేడు సమావేశమయ్యారు. ఈ నేపథ్యంలో వారి సమస్యలు విన్న సీఎం ఆటో, ఊబర్, ర్యాపిడో, ఓలా వర్కర్ల కోసం ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు, ఎలాంటి భరోసా కల్పించనున్నారనేది ప్రాధాన్యతను సంతరించుకుంది.
మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించడంపై ఆటో డ్రైవర్లు మండిపడుతున్నారు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు ఉపాధి కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని తెలంగాణ స్టేట్ ఆటో అండ్ టాక్సీ డ్రైవర్స్ యూనియన్ నేతలు కోరారు. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్ బస్ భవన్ ముందు గ్రేటర్ హైదరాబాద్ ఆటో, టాక్సీ డ్రైవర్స్ యూనియన్ ధర్నా చేపట్టారు. మహిళలకు ఫ్రీ బస్ స్కీమ్ ద్వారా తాము నష్టపోతున్నామని చెబుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని యూనియన్ నాయకులు వెంకట్ ఆవేదన వ్యక్తం చేశారు. ఓలా, ఊబర్, రాపిడ్ బైక్ ల అక్రమ వ్యాపారం వల్ల ఆటో డ్రైవర్స్ తీవ్రంగా నష్టపోయి రోడ్డున పడుతున్నారని తెలిపారు. తక్షణమే ప్రభుత్వం తమ ఉపాధి దెబ్బతినకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.





Total views : 141335