ఎ.టి.ఎం. లో నగదు విత్ డ్రా చేయడానికి వెళ్ళిన వ్యక్తి వద్ద కార్డు దొంగిలించి ఆ కార్డు తో 1,86,000/- రూపాయలు దొంగిలించిన ఘటన ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం లో చోటు చేసుకుంది. జంగారెడ్డిగూడెం మండలం లక్కవరం గ్రామానికి చెందిన అరుణ్ కుమార్ అనే వ్యక్తి ఈ నెల 14 వతేదీ న తన భార్య ఖాతా కు సంబంధించిన ఎ.టి.ఎం. కార్డు ను తీసుకుని జంగారెడ్డిగూడెం లోని రామాలయం స్టేట్ బ్యాంకు ఎ.టి.ఎం. లో 5,000/- రూపాయలు విత్ డ్రా చేయడానికి వెళ్ళాడు. అయితే డబ్బులు తీయడానికి అవగాహనా లేకపోవడం తో అక్కడికి వచ్చిన మరొక వ్యక్తి సహాయంతో ఎ.టి.ఎం. నుండి డబ్బులు విత్ డ్రా చేసి తీసుకున్నాడు. అదే సమయంలో అరుణ్ కుమార్ కు సహకరించిన గుర్తు తెలియని వ్యక్తి అరుణ్ కుమార్ కు చెందిన ఖాతాలో డబ్బులు భారీగా వున్నట్లు గుర్తించి అరుణ్ కుమార్ ఎ.టి.ఎం. కార్డ్ ను దొంగిలించి తనవద్ద నున్న కార్డు ను అరుణ్ కుమార్ కి ఇచ్చాడు. కార్డు లో తేడా ను గుర్తించలేని అరుణ్ కుమార్ అతను ఇచ్చిన కార్డు ను తీసుకుని లక్కవరం వెళ్ళిపోయాడు. అయితే అరుణ్ కుమార్ వద్ద నుండి ఎ.టి.ఎం. కార్డు ను దొంగిలించిన గుర్తు తెలియని వ్యక్తి దఫదఫాలుగా అరుణ్ కుమార్ కార్డు ను వుపయోగించి 1,86,000/- రూపాయలు విత్ డ్రా చేసి దొంగిలించాడు. అయితే డబ్బులు విత్ డ్రా చేసిన ప్రతిసారీ అరుణ్ కుమార్ కు మెసేజ్ లు వచ్చినప్పటికీ కార్డు వాడడంలో అనుభవం లేకపోవడం వలన అరుణ్ కుమార్ ఆ మెసేజ్ లను పట్టించుకోలేదు. నిన్న అరుణ్ కుమార్ కు డబ్బులు అవసరమై బ్యాంకు కు వెళ్లి చూడగా దఫదఫాలుగా ఎ.టి.ఎం. నుండి 1,86,000/- రూపాయలు విత్ డ్రా అయ్యాయని తెలుసుకుని తన వద్ద నున్న కార్డ్ ను పరిశీలించగా అది తన కార్డు కాదని తెలుసుకుని బ్యాంకు వారిని సంప్రదించగా ఆ కార్డు ను పరిశీలించిన బ్యాంకు వారు ఆ కార్డు మేడపాటి వెంకటసత్యనారాయణ అనే వ్యక్తి కి చెందినదని, ఆ వ్యక్తే అరుణ్ కుమార్ డబ్బు ను కాజేసి ఉండవచ్చని తెలిపినారు. తాను మోసపోయినట్లు తెలుసుకున్న అరుణ్ కుమార్ బ్యాంకు వారి సూచన మేరకు జంగారెడ్డిగూడెం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు సి.సి.టి.వి. ఫుటేజీ ని పరిశీలించగా అరుణ్ కుమార్ డబ్బులు డ్రా చేసే సమయంలో అతనితో వున్న టోపీ పెట్టుకున్న వ్యక్తి ని నిందితుడిగా గుర్తించి దర్యాప్తు చేస్తున్నారు.
తస్మాత్ జాగ్రత్త..! మీ కార్డును ఎవరికి ఇవ్వకండి
74
previous post