92
పల్నాడు జిల్లా సత్తెనపల్లి ఏరియా హాస్పిటల్ లో ఘనంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలకు జల వనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ముఖ్యమంత్రి 51 సంవత్సరాలను పురస్కరించుకొని 51 కేజీల కేకును కట్ చేసారు. అనంతరం రక్తదాన శిబిరాన్ని ప్రారంభించి, రక్తదానం చేసిన వారికి ప్రశంస పత్రాలను అందజేసారు. ఈ వేడుకకీ పలువురు వైఎస్ ఆర్సిపీ నాయకులు, కార్యకర్తలు, పాల్గొన్నారు.