రాయచోటి లో మానవత సంస్థ నెలవారీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిధిలుగా జిల్లా అసిస్టెంట్ ట్రేజరర్ హరిత, లక్కిరెడ్డి పల్లి వ్యవసాయ అధికారి రమేష్, సీనియర్ సాఫ్ట్వేరే మల్లికార్జున రెడ్డి, మానవత సభ్యలు, డి సి సి బ్యాంక్ అసిస్టెంట్ మేనజర్ రమణా రెడ్డి, విల్వపతి రెడ్డి లు హాజరయ్యారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిస్వార్థ సేవకు నిదర్శనం మానవతా సంస్థ అని కొనియాడారు. రాయచోటి లో రాయచోటి, చిత్తూరు రింగ్ రోడ్డు నందు మానవత అధ్యక్షులు చింతం రెడ్డి వెంకట్రామి రెడ్డి, సెక్రెటరి వెంకటరమణ నాయుడు, ఉపాధ్యక్షులు సంచుల ఖాదర్ బాషా ఆధ్వర్యంలో మానవత నెలవారీ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సచివాలయంలో పంచాయతి కార్యదర్శిగా విధులు నిర్వర్తిస్తూ ఇటివలే గ్రూప్ 1 పరిక్షా ఫలితాలలో రాష్ట్ర స్థాయిలో మంచి ర్యాంక్ సాధించి జిల్లా అసిస్టెంట్ ట్రెజరర్ గా విధులు నిర్వహిస్తున్న హరిత దంపతులు హజరయ్యారు. వీరి వివాహ వార్షికోత్సవం సందర్భంగా మానవత సంస్థ సేవలు కు గాను పది వేల నగదు విరాళాన్ని అందజేశారు. అదేవిధంగా సంబేపల్లి మండలం వాసి సీనియర్ సాఫ్ట్ వేరే మల్లికార్జున కుడా ముఖ్య అతిధిగా హాజరై మానవత సంస్థ కు ఫ్రీజర్ బాక్స్ ను అందజేస్తానని తెలియజేశారు. మానవత సభ్యులు విల్వపతి రెడ్డి దగ్గర నమ్మకస్తుడైన కీ..శే..లు రామజోగి జ్ఞాపకార్థం పది వేలు నగదు విరాళాన్ని మానవత కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అనే నినాదంతోనే రామచంద్ర రెడ్డి గారు మానవత సంస్థను ఏర్పాటు చేసి అనేక రకాల సేవా కార్యక్రమాలు నిర్వహించుచుండడం చాల అభినందనియమన్నారు. ప్రతి ఒక్కరు కుడా సమాజ శ్రేయస్సు కోసం వారి వారి వంతు సహాయ సహకారాలు అందించాలని వారు కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా నున్న అన్ని జిల్లాల్లో కుడా మానవత సంస్థలు కమిటిలు ఏర్పాటు చేసి ప్రముఖులు దాతల సహకారంతో సేవలు చేసి ఎటువంటి లాభాపేక్ష లేకుండా సేవలు చేస్తున్నట్లు మానవత కుటుంబ సభ్యులు వివరించారు. మానవత సంస్థ వారు అంబులెన్స్, శాంతి రథం, ఫ్రీజర్ బాక్స్ లు 24 x7 రాయచోటి పరిసర ప్రాంత ప్రజలకు సేవలు అందజేస్తున్నామన్నారు. మానవత నెలవారీ సమావేశానికి ముఖ్య అతిధిలుగా హాజరై ప్రజలకు సేవలు అందించ్చేందుకు నగదు విరాళంతో పాటు బాడి ఫ్రీజర్ బాక్స్ ను అందజేసిన వారికీ వారి కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు తెలియజేశారు. అతిధిలుగా హాజరైన వారిని శాలువాతో సన్మానించి మానవత మెమెంటోలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు సంచుల ఖాదర్ బాష, కేంద్ర కమిటి సభ్యులు సహదేవ రెడ్డి, జిల్లా కమిటి సభ్యులు ఆనంద్ రెడ్డి, కో చైర్మన్ షకీల్, సభ్యులు శ్రీదర్ రెడ్డి, తాతి రెడ్డి, రెడ్డప్ప రెడ్డి, సుబ్బారెడ్డి, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు ..