మొబైల్ ఫోన్ సిమ్ కార్డుల జారీకి సంబంధించి కేంద్రం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త సిమ్ కార్డుల జారీకి కొత్త రూల్స్ తీసుకొచ్చేందుకు సిద్ధమైంది. ఈ కొత్త రూల్ జనవరి 1 నుంచి అమల్లోకి రానుంది. దీంతో ఇకపై సిమ్ కార్డులు తీసుకునేందుకు పేపర్ విధానం కనుమరుగు కానుంది. సిమ్ కార్డుల జారీకి కొత్త రూల్ అమలోకి తీసుకురానుంది. ఇప్పటి వరకు అమలులో ఉన్న పేపర్ ఆధారిత కేవైసీ వెరిఫికేషన్ విధానాన్ని టెలికాం విభాగం డాట్ నిలిపివేసింది. దాని స్థానంలో డిజిటల్ వెరిఫికేషన్‌ను తీసుకొస్తోంది. ఈ కొత్త రూల్ వచ్చే ఏడాది అంటే జనవరి 1, 2024 నుంచే అమలులోకి వస్తుందని డాట్ వెల్లడించింది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పట్ల దిగ్గట టెలికాం సంస్థలు ఎయిర్ టెల్, రిలయన్స్ జియో, వొడాఫోన్ ఐడియా కంపెనీలు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి. మరోవైపు ఈ కొత్త నిబంధనలు అమలులోకి రావడం వల్ల సిమ్ కార్డుల మోసాలను సైతం అరికట్టొచ్చని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతం మొబైల్ నెట్‍వర్క్ సిమ్ కార్డుల జారీకి పేపర్ విధానంలో ఫారం నింపాల్సి ఉంటుంది. దీనికి గుర్తింపు పత్రాలు, ఫొటోల వంటివి జత చేయాల్సి వస్తుంది. ఈ క్రమంలో ఇకపై పూర్తి స్థాయిలో సిమ్ కార్డుల జారీ, కేవైసీ వెరిఫికేషన్ విధానాన్ని డిజిటల్‌గా మార్చనుంది కేంద్రం. ఎప్పటికప్పుడు మారుతున్న కేవైసీ నిబంధనల్లో భాగంగా ఈ మార్పులు చేపట్టినట్లు టెలికాం విభాగం డాట్ ఓ నోటిఫికేషన్‌లో వెల్లడించింది. మరోవైపు సిమ్ కార్డుల ద్వారా జరిగే మోసాలను సైతం అరికట్టొచ్చని కేంద్ర సర్కార్ భావిస్తోంది. సిమ్ కార్డుల ద్వారా జరిగే మోసాలను అరికట్టేందుకు కేంద్రం ఇటీవల తీసుకున్న కొన్ని చర్యల్లో భాగంగా కొత్తగా ఈ డిజిటల్ విధానాన్ని తీసుకొచ్చింది.
వచ్చే ఏడాది సిమ్ కార్డు లో కొత్త రూల్స్ జారీ..!
67
previous post