సంక్రాంతి నుండి ఆంధ్రప్రదేశ్ లో మహిళలకు ఆర్టీసి బస్ లలో ఉచిత బస్ ప్రయాణం కల్పిస్తామని ప్రకటించిన నేపథ్యంలో ఆటో యూనియన్ లు నిరసన వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వం ప్రకటించిన మహిళలకు ఉచిత బస్ ప్రయాణం ప్రకటనకు నిరసనగా ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం డివిజన్ లోని అన్ని మండలాలలో ఆటో డ్రైవర్ లు సర్వీస్ లు బంద్ చేశారు. ఫ్రీ బస్ వద్దు ఆటో డ్రైవర్ ల పొట్ట కొట్టద్దు, స్త్రీ అంటే మా అమ్మ, మా అక్క, మా చెల్లి, మా కుటుంబం అని మేము స్త్రీలకు వ్యతిరేకం కాదని, ఫ్రీ బస్ సర్వీస్ పేరుతో ఆటో డ్రైవర్ ల కడుపు కొట్టవద్దని నినాదాలతో పాసింజర్ ఆటో డ్రైవర్ అండ్ ఆటో ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జంగారెడ్డిగూడెం మార్కెట్ యార్డ్ వద్ద నుండి వందలాది ఆటో లతో ఆర్.డి.ఓ. కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించి ఆర్.డి.ఓ. కార్యాలయాన్ని ముట్టడించారు. ఆటో డ్రైవర్ ల కుటుంబాలను రోడ్డున పడేసే ఫ్రీ బస్ సర్వీస్ సర్వీస్ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడతామని ఆటో యూనియన్లు ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాయి.
మేము బ్రతికేదేలా..? ఫ్రీ బస్సులపై ఆటో డ్రైవర్ల ఆందోళన
65
previous post