చలికాలం వచ్చిందంటే చాలు కీళ్ల నొప్పులు, ఒంటి నొప్పులతో బాధపడే వారి సంఖ్య బాగా పెరుగుతుంది. ఇక ఉదయం పూట పరిస్థితి అయితే మరీ దారుణంగా ఉంటుంది. కీళ్లు గట్టి పడిపోవడం, జాయింట్లు సహకరించక పోవడంతో చాలామంది ఇబ్బందులు పడుతూ ఉంటారు. చలికాలంలో సూర్యరశ్మి శరీరానికి కావలసినంత అందకపోవడం వల్ల విటమిన్ డి లోపం ఏర్పడుతుంది. విటమిన్-డి లోపాన్ని తగ్గించుకోవడానికి విటమిన్ డి సప్లిమెంట్లు తీసుకోవడం ఎంతో మంచిది. సల్ఫర్ ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకున్నా, క్యాల్షియం ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకున్నా కాస్త కీళ్ల నొప్పుల నుండి ఉపశమనం లభిస్తుంది. నారింజ, క్యాబేజీ, బచ్చలికూర, టమోటాలు వంటి వాటిని ఆహారంలో భాగంగా చేసుకోవడం మంచిదని చెబుతున్నారు. చలికాలం కీళ్లనొప్పులతో బాధపడేవారు శరీరాన్ని డీహైడ్రేటెడ్ కాకుండా చూసుకోవాలని, తగినంత ఎక్కువగా నీటిని తాగాలని సలహా ఇస్తున్నారు. క్రమం తప్పకుండా వ్యాయామం చేసే వారికి నొప్పుల నుండి కొంత ఉపశమనం లభిస్తుంది.
కీళ్ల నొప్పులతో బాధపడుతున్నారా..!
77
previous post