కీళ్ల నొప్పులు, ఒంటి నొప్పులతో బాధపడే వారి సంఖ్య బాగా పెరుగుతుంది. ఇక ఉదయం పూట పరిస్థితి అయితే మరీ దారుణంగా ఉంటుంది. కీళ్లు గట్టి పడిపోవడం, జాయింట్లు సహకరించక పోవడంతో చాలామంది ఇబ్బందులు పడుతూ ఉంటారు. కీళ్ల నొప్పుల నుండి, ఒంటి నొప్పుల నుండి ఉపశమనం పొందడానికి కచ్చితంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. చలికాలంలో సూర్యరశ్మి శరీరానికి కావలసినంత అందక పోవడం వల్ల విటమిన్ డి లోపం ఏర్పడుతుంది. విటమిన్-డి లోపాన్ని తగ్గించుకోవడానికి విటమిన్ డి సప్లిమెంట్లు తీసుకోవడం ఎంతో మంచిది. సల్ఫర్ ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకున్నా, క్యాల్షియం ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకున్నా కాస్త కీళ్ల నొప్పుల నుండి ఉపశమనం లభిస్తుంది. కీళ్ల నొప్పులు బాధిస్తున్న వారు సమతుల్యమైన ఆహారాన్ని తీసుకుంటే మంచిదని, సమతుల ఆహారంతో కీళ్లనొప్పుల నుండి ఉపశమనం లభిస్తుందని చెబుతున్నారు. నారింజ, క్యాబేజీ, బచ్చలికూర, టమోటాలు వంటి వాటిని ఆహారంలో భాగంగా చేసుకోవడం మంచిదని చెబుతున్నారు. క్రమం తప్పకుండా వ్యాయామం చేసే వారికి నొప్పుల నుండి కొంత ఉపశమనం లభిస్తుంది.
Oranges
చాలామందిని పట్టిపీడిస్తున్న వ్యాధులలో మధుమేహం ఒకటి. ఇది శరీరంలో అనియంత్రిత చక్కెర స్థాయి కారణంగా సంభవిస్తుంది. శరీరంలో రక్తంలో చక్కెర స్థాయి 250 కంటే ఎక్కువ ఉంటే, వైద్యుడి వద్దకు వెళ్లడం మంచిదని చెబుతారు. బొప్పాయి తినడం వల్ల మధుమేహాన్ని అదుపులో ఉంచుకోవచ్చు. అయితే అది ఎలా తినాలో ఇప్పుడు తెలుసుకుందాం. చక్కెర స్థాయిని నియంత్రించడానికి, డయాబెటిక్ రోగులు బొప్పాయితో సిట్రస్ పండ్లను తీసుకోవచ్చు. ఈ రెండింటినీ కలిపి తినడం వల్ల శరీరంలో చక్కెర స్థాయిని సరిగ్గా ఉంచుతుంది. ఇలా చేయడం వల్ల ఉదర సమస్యలు కూడా తొలగిపోతాయి ఎందుకంటే ఈ రెండింటిని కలిపి తింటే కొలెస్ట్రాల్ కూడా తగ్గుతుంది. మీకు కావాలంటే, మీరు బొప్పాయి మరియు నారింజ వంటి సిట్రస్ పండ్ల స్మూతీని తయారు చేసి తినవచ్చు. బొప్పాయిని సరైన మోతాదులో తింటే. అది వారి చక్కెర స్థాయిపై చెడు ప్రభావం చూపదని నిపుణులు అంటున్నారు. మధుమేహ వ్యాధిగ్రస్తులు పండిన బొప్పాయిని సరైన పరిమాణంలో రోజూ తినవచ్చు. సలాడ్ రూపంలో కూడా దీన్ని తమ ఆహారంలో భాగం చేసుకోవచ్చు. బొప్పాయిని అల్పాహారం మరియు మధ్యాహ్న భోజనం మధ్య లేదా లంచ్ మరియు డిన్నర్ మధ్య తినడం చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు.
లివర్ మన శరీరంలో ఎంతో ముఖ్యమైన అవయవం. లివర్ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఈ పండ్లు తీసుకోండి. బొప్పాయిలో విటమిన్లు, ఎంజైమ్‌లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి గుండె, జీర్ణక్రియ, రోగనిరోధక వ్యవస్థకు మేలు చేస్తాయి. జీర్ణక్రియకు సహాయం చేయడం ద్వారా, బొప్పాయి లివర్ పై పని భారాన్ని తగ్గిస్తుంది. లివర్ మరింత సమర్థవంతంగా పనిచేయాడానికి సహాయపడుతుంది. అవకాడోలో ఆరోగ్యకరమైన కొవ్వులు పుష్కలంగా ఉంటాయి. ఈ కొవ్వులు ఒక కవచంగా పనిచేసి, సంభావ్య నష్టం నుంచి లివర్‌ను రక్షిస్తాయి. మీ డైట్లో అవకాడోలో చేర్చుకుంటే గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఆస్టియోపోరోసిస్ ముప్పును నివారిస్తుంది. స్ట్రాబెర్రీలు, రాస్ప్బెర్రీస్, బ్లాక్బెర్రీస్లు యాంటీఆక్సిడెంట్లు నిండి ఉంటాయి. నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్‌లో ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం, గ్రేప్ ఫ్రూట్లో నారింగిన్, నరింగెనిన్ వంటి యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి శరీరంలో ఫ్రీరాడికల్స్ నుంచి లివర్ కణాలను రక్షిస్తాయి, బ్యాక్టీరియా నుంచి లివర్‌ను రక్షిస్తాయి. ఫ్యాటీ లివర్ కారణంగా లివర్‌కు కలిగే నష్టాన్ని సరిచేయడానికి గ్రేప్ ఫ్రూట్ తోడ్పడుతుంది. రోజుకొక ఒక యాపిల్ తింటే లివర్ సమస్యలను దూరం చేసుకోవచ్చు. యాపిల్స్‌లో కరిగే ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది లివర్‌ను డిటాక్స్ చేస్తుంది, తద్వారా లివర్ పనితీరును మెరుగుపరుస్తుంది. యాపిల్‌లోని ఫైబర్ లివర్ ఫ్యాట్‌ను కూడా తగ్గించడానికి తోడ్పడుతుంది. యాపిల్స్ జీర్ణక్రియ, మొత్తం ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తాయి. నారింజ, నిమ్మకాయలు, బత్తాయి వంటి సిట్రస్ పండ్లలో విటమిన్ సి సమృద్ధిగా ఉంటుంది. ఇది ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తుంది. సిట్రస్ పండ్లలోని పోషకాలు లివర్ ఆరోగ్యాన్ని రక్షిస్తాయి, లివర్‌ను డిటాక్స్ చేస్తుంది.
Read Also..
Read Also..
చలికాలం వచ్చిందంటే చాలు కీళ్ల నొప్పులు, ఒంటి నొప్పులతో బాధపడే వారి సంఖ్య బాగా పెరుగుతుంది. ఇక ఉదయం పూట పరిస్థితి అయితే మరీ దారుణంగా ఉంటుంది. కీళ్లు గట్టి పడిపోవడం, జాయింట్లు సహకరించక పోవడంతో చాలామంది ఇబ్బందులు పడుతూ ఉంటారు. చలికాలంలో సూర్యరశ్మి శరీరానికి కావలసినంత అందకపోవడం వల్ల విటమిన్ డి లోపం ఏర్పడుతుంది. విటమిన్-డి లోపాన్ని తగ్గించుకోవడానికి విటమిన్ డి సప్లిమెంట్లు తీసుకోవడం ఎంతో మంచిది. సల్ఫర్ ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకున్నా, క్యాల్షియం ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకున్నా కాస్త కీళ్ల నొప్పుల నుండి ఉపశమనం లభిస్తుంది. నారింజ, క్యాబేజీ, బచ్చలికూర, టమోటాలు వంటి వాటిని ఆహారంలో భాగంగా చేసుకోవడం మంచిదని చెబుతున్నారు. చలికాలం కీళ్లనొప్పులతో బాధపడేవారు శరీరాన్ని డీహైడ్రేటెడ్ కాకుండా చూసుకోవాలని, తగినంత ఎక్కువగా నీటిని తాగాలని సలహా ఇస్తున్నారు. క్రమం తప్పకుండా వ్యాయామం చేసే వారికి నొప్పుల నుండి కొంత ఉపశమనం లభిస్తుంది.
చాలామంది రోజంతా కంప్యూటర్లు, స్మార్ట్‌ఫోన్ స్క్రీన్లు చూస్తూ ఉంటారు. దీనివల్ల కంటి చూపు బలహీనపడటం మొదలవుతుంది. ఇక వయస్సు పెరుగుతుంటే కూడా కంటి చూపు మందగిస్తుంది. కంటి సమస్య ఎక్కువైన తర్వాత ఆస్పత్రుల బాట పడుతూ ఉంటారు. అయితే ముఖ్యంగా కంప్యూటర్ల ముందు పనిచేసేవారు మీ కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవటానికి ఏం చెయ్యాలి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? తెలుసుకుందాం. ప్రతీరోజూ ఒక గ్లాస్ క్యారెట్ జ్యూస్ తాగటం వలన కంటి చూపు మెరుగుపడుతుంది. క్యారెట్ లో ఉండే పోషకాలు కంటి ఆరోగ్యానికి మేలు చేస్తాయి. చేపలు కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరిచే మరో మంచి ఆహారం. చేపలలో ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇవి కంటి ఆరోగ్యానికి ఎంతగానో ఉపయోగపడతాయి. ఇక మన ఆహారంలో ఆకుకూరలు చేర్చుకుంటే కూడా కంటి ఆరోగ్యం మెరుగుపడుతుంది. బచ్చలికూర వంటి ఆకుకూరలు కంటి ఆరోగ్యాన్ని పెంచుతాయి. కంటి ఆరోగ్యం కోసం ఆహారం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరిచే ఆహారాల విషయానికి వస్తే సిట్రస్ పండ్లలో కంటి ఆరోగ్యాన్ని పెంచే పోషకాలు ఉంటాయి. బత్తాయి, నారింజ వంటి పండ్లలో కంటికి ఉపయోగపడే పోషకాలు ఉంటాయి. నారింజ పండులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, కెరోటినాయిడ్లు కంటి చూపును మెరుగుపరుస్తాయి. మనం తీసుకునే ఆహారంలో టమాటాలను చేరిస్తే మంచి ప్రయోజనం ఉంటుంది. టమాటాలలో మన కంటి చూపును కాపాడే లైకోపీన్ ఉంటుంది. ఈ ఆహారాలను కంటి చూపును మెరుగుపరచుకోవటం తీసుకోవటంతో పాటు కంప్యూటర్ల ముందు పని చేసేవారు గంటకో మారు బ్రేక్ తీసుకుని చిన్న చిన్న కళ్ళకు సంబంధించిన ఎక్సర్సైజులు చెయ్యటం మంచిది.కంటి ఆరోగ్యాన్ని బాదం పప్పు బాగా పెంచుతుంది. బాదం పప్పు నానబెట్టి నిత్యం రెండు పప్పులు తినటం కంటికి మేలు చేస్తుంది. గ్రుడ్లు, చికెన్ కూడా కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరిచే అద్భుతమైన ఆహరం. గ్రుడ్లలో జింక్, విటమిన్ ఏ ఉంటుంది. ఇది కళ్ళకు మేలు చేస్తుంది. చికెన్ లో ఉండే ప్రోటీన్ కంటి ఆరోగ్యానికి కావాల్సిన పోషకాలను ఇస్తుంది.
Read Also..
Read Also..





Total views : 80524