Friday, June 19, 2026
News Navigation
Friday, June 19, 2026
News Navigation

Breaking

Friday, June 19, 2026
Home Health లివర్‌ కాపాడుకోవడానికి ఈ పండ్లు తీసుకోండి!

లివర్‌ కాపాడుకోవడానికి ఈ పండ్లు తీసుకోండి!

by Satya
liver health

లివర్‌ మన శరీరంలో ఎంతో ముఖ్యమైన అవయవం. లివర్‌ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఈ పండ్లు తీసుకోండి. బొప్పాయిలో విటమిన్లు, ఎంజైమ్‌లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి గుండె, జీర్ణక్రియ, రోగనిరోధక వ్యవస్థకు మేలు చేస్తాయి. జీర్ణక్రియకు సహాయం చేయడం ద్వారా, బొప్పాయి లివర్‌ పై పని భారాన్ని తగ్గిస్తుంది. లివర్‌ మరింత సమర్థవంతంగా పనిచేయాడానికి సహాయపడుతుంది. అవకాడోలో ఆరోగ్యకరమైన కొవ్వులు పుష్కలంగా ఉంటాయి. ఈ కొవ్వులు ఒక కవచంగా పనిచేసి, సంభావ్య నష్టం నుంచి లివర్‌ను రక్షిస్తాయి. మీ డైట్‌లో అవకాడోలో చేర్చుకుంటే గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఆస్టియోపోరోసిస్‌ ముప్పును నివారిస్తుంది. స్ట్రాబెర్రీలు, రాస్ప్బెర్రీస్‌, బ్లాక్బెర్రీస్‌లు యాంటీఆక్సిడెంట్లు నిండి ఉంటాయి. నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్‌లో ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం, గ్రేప్‌ ఫ్రూట్‌లో నారింగిన్‌, నరింగెనిన్ వంటి యాంటీఆక్సిడెంట్‌లు ఉంటాయి. ఇవి శరీరంలో ఫ్రీరాడికల్స్‌ నుంచి లివర్‌ కణాలను రక్షిస్తాయి, బ్యాక్టీరియా నుంచి లివర్‌ను రక్షిస్తాయి. ఫ్యాటీ లివర్‌ కారణంగా లివర్‌కు కలిగే నష్టాన్ని సరిచేయడానికి గ్రేప్‌ ఫ్రూట్‌ తోడ్పడుతుంది. రోజుకొక ఒక యాపిల్‌ తింటే లివర్‌ సమస్యలను దూరం చేసుకోవచ్చు. యాపిల్స్‌లో కరిగే ఫైబర్‌ పుష్కలంగా ఉంటుంది. ఇది లివర్‌ను డిటాక్స్‌ చేస్తుంది, తద్వారా లివర్‌ పనితీరును మెరుగుపరుస్తుంది. యాపిల్‌లోని ఫైబర్‌ లివర్‌ ఫ్యాట్‌ను కూడా తగ్గించడానికి తోడ్పడుతుంది. యాపిల్స్ జీర్ణక్రియ, మొత్తం ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తాయి. నారింజ, నిమ్మకాయలు, బత్తాయి వంటి సిట్రస్‌ పండ్లలో విటమిన్‌ సి సమృద్ధిగా ఉంటుంది. ఇది ఇమ్యూనిటీని బూస్ట్‌ చేస్తుంది. సిట్రస్‌ పండ్లలోని పోషకాలు లివర్‌ ఆరోగ్యాన్ని రక్షిస్తాయి, లివర్‌ను డిటాక్స్‌ చేస్తుంది.

Read Also..

Read Also..

Advertisements

You may also like

Our Visitor

025744
Total views : 149033

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.