సిద్దిపేట్ జిల్లా కొమురవెల్లి మండలం శ్రీ కొమురవెల్లి మల్లికార్జున స్వామి దేవాలయం అయినటువంటి మల్లికార్జున స్వామి కళ్యాణం ఈ సంవత్సరం జనవరి 7వ తారీకు రోజు స్వామివారి కళ్యాణం జరగనుంది. ఈ స్వామివారి కళ్యాణం గత పది సంవత్సరాలుగా టిఆర్ఎస్ పార్టీ మరియు దేవస్థాన అధికారుల చేత ఘనంగా నిర్వహించారు. తెలంగాణ వచ్చిన తర్వాత మొదటిసారిగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఈ సంవత్సరం స్వామివారి కల్యాణాన్ని ఘనంగా నిర్వహించాలని, మొట్టమొదటిసారిగా దేవస్థాన మంత్రిగా బాధ్యతలు చేపట్టిన కొండ సురేఖ నిన్న సాయంత్రం సిద్దిపేటలో హరిత హోటల్లో స్వామివారి కల్యాణ ఏర్పాట్ల గురించి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి కొండా సురేఖ, జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, సిద్దిపేట జిల్లా కలెక్టర్ మరియు జనగామ జిల్లా కాంగ్రెస్ ఇంచార్జ్ మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాపరెడ్డి గారు హాజరయ్యారు. స్టేజ్ పైకి వచ్చిన ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి గారు అలాగే కొమ్మూరి ప్రతాపరెడ్డి గారు కూడా స్టేజి పైన కూర్చోవడంతో అసంతృప్తికి లోనయ్యారు. కాసేపు కొండా సురేఖ గారితో వాగ్వివాదం చేశారు. ఇది కాంగ్రెస్ పార్టీ మీటింగ్ అనుకుంటున్నారా లేక దేవస్థాన ఏర్పాట్ల గురించి జరిగిన మీటింగ్ అనుకుంటున్నారా అని కొండ సురేఖ గారిని ప్రశ్నించారు. కొండా సురేఖ గారు నేను ఒక దేవాదాయ శాఖ మంత్రిగా స్టేజ్ పైకి ఎవరిని అయినా పిలుచుకోవచ్చు ఇది కాంగ్రెస్ పార్టీతో సంబంధం లేదు. మీకు ఇష్టం అయితే స్టేజి పైన ఉండొచ్చు లేకుంటే వెళ్లిపోవచ్చు అని బదులు ఇచ్చారు. దీంతో అవాక్కు అయిన జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి గారు స్టేజిని వదిలి తన కార్యకర్తలతో సభను బహిష్కరించి బయటికి వెళ్లిపోయారు. మల్లికార్జున స్వామి కళ్యాణ ఏర్పాట్ల గురించి ఎప్పుడూ జరగని విధంగా దేవాలయ పరిసరాలలో కాకుండా దూరంగా ఉన్నటువంటి సిద్దిపేట దగ్గరలో పెట్టడం పద్ధతి కాదు అలాగే కొమురవెల్లి మండల ఎంపీపీ గారిని జడ్పిటిసి గారిని గ్రామ సర్పంచ్ గారిని అక్కడి ప్రజాప్రతినిధులను పిలవకపోవడం బాధాకరం అని తెలిపారు.
పల్లా రాజేశ్వర్ రెడ్డి, కొండా సురేఖకు మధ్య వాగ్వాదం..
63