చిక్కడపల్లి వివేక్ నగర్ లోని శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అయోధ్య రామ మందిరం అక్షింతలను ఇంటింటికీ రాజ్యసభ సభ్యులు డాక్టర్ కే లక్ష్మణ్ పంపిణీ చేశారు. హైదరాబాద్ చిక్కడపల్లి లోని వివేక్ నగర్ లోని హనుమాన్ దేవాలయంలో అయోధ్య నుంచి తీసుకొచ్చిన అక్షింతలకు పూజలు నిర్వహించి స్థానిక కార్పొరేటర్ పావని వినయ్ కుమార్ తో కలిసి డాక్టర్ కే లక్ష్మణ్ ఇంటింటికి అక్షింతలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 500 సంవత్సరాల తర్వాత రాముల వారి విగ్రహాన్ని పునః ప్రతిష్టాపన జరుగుతుందన్నారు. భవ్యమైన రామ మందిరంలో బాల రాముని విగ్రహ ప్రతిష్టాపన చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించతగ్గది అన్నారు. హిందువుల మనోభావాలను కాపాడడమే కాకుండా ప్రపంచం అయోధ్య వైపు చూస్తోందనీ, 22వ తేదీన విగ్రహా ప్రతిష్టాపన నేపథ్యంలో ప్రతి ఇంటి ముందు ఐదు దీపాలను వెలిగించాలనీ ఆయన సూచించారు. సనాతన ధర్మం గర్వపడేలా అందరూ తమ ఇళ్ల ముందు దీపాలు వెలిగించాలి. సనాతన ధర్మం ఏ విధంగా కాపాడుతుందో ఆ ధర్మం మనల్ని కాపాడుతుంది. నాడు తుర్కీషులు ఆలయాలను, మందిరాలను ధ్వంసం చేసి వినాశనాన్ని కోరుకుంటే వారే నాశనమయ్యారనీ అన్నారు.
Read Also..