నంద్యాల జిల్లా శ్రీశైలం మహాక్షేత్రంలో మకర సంక్రాంతి పుణ్యకాలన్ని పురస్కరించుకొని నేటి నుండి 12 నుంచి 18 వరకు మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తామని దేవస్థానం ఈవో పెద్ది రాజు తెలిపారు. పంచాహ్నిక దీక్షతో 7 రోజుల పాటు జరిగే ఈ బ్రహ్మోత్సవాలు ఈనెల 18న ముగుస్తాయని ఆలయ సాంప్రదాయాన్ని అనుసరించి మల్లికార్జునస్వామికి ఏటా రెండు సార్లు అనగా సంక్రాంతికి, శివరాత్రికి దేవస్థానం బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ సంక్రాంతి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈరోజు ఉదయం 8.30 గంటలకు స్వామివారి యాగశాల ప్రవేశంతో సంక్రాంతి బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుట్టనున్నారు. అదేరోజు సాయంత్రం 5 గంటలకు అంకురార్పణ అగ్ని ప్రతిష్టాపన 7 గంటలకు ధ్వజారోహణ సకల దేవతలను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానం పలుకుతూ ధ్వజపటం ఆవిష్కరిస్తామని అధికారులు తెలిపారు. బ్రహ్మోత్సవాల భాగంగానే శ్రీస్వామి అమ్మవార్లకు ప్రతిరోజు విశేష పూజలు నిర్వహించనున్నారు. బ్రహ్మోత్సవాలు ప్రారంభమైన రెండోరోజు నుంచి అనగా ఈ నెల 13 నుండి శ్రీ స్వామి అమ్మవార్లకు ప్రతిరోజు సాయంత్రం విశేషపూజలు, వాహనసేవలు నిర్వహిస్తామని ఈనెల 15 వ తేదీ మకర సంక్రాంతి పురష్కరించుకొని శ్రీస్వామి అమ్మవారికి బ్రహ్మోత్సవ కళ్యాణం, అలాగే మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాల భాగంగా చిన్న పిల్లలకు భోగి పండ్లు, మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహిస్తునట్లు ఈవో పెద్దిరాజు తెలిపారు. ఉత్సవాల సందర్భంగా 12 నుంచి 18 వరకు ప్రత్యక్ష, పరోక్ష సేవలైన రుద్రహోమం, చండీ హోమం, మృత్యుంజయహోమం, సుబ్రహ్మణ్యేశ్వరస్వామి కళ్యాణం, శ్రీ స్వామి అమ్మవార్ల కళ్యాణం, ఏకాంత సేవలు తాత్కాలిక నిలుపుదల చేస్తామని ఆలయ ఈవో పెద్దిరాజు తెలిపారు.
Read Also..