దేశంలోని అతిపెద్ద IT సేవల సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) తమ ఉద్యోగులకు AIపై శిక్షణ ఇచ్చేందుకు భారీ మొత్తంలో వెచ్చించడానికి సైతం వెనకాడటం లేదు. ఈ రంగంలో లక్ష మంది ఉద్యోగులకు శిక్షణను పూర్తి చేశామని వెల్లడించింది. నిన్న రిలీజ్ అయిన TCS Q2 ఫలితాల కాన్ఫరెన్స్ లో కంపెనీ CEO & MD కృతివాసన్ ఈ మేరకు ప్రకటించారు.
‘జనరేటివ్ AI అందరి దృష్టినీ ఆకర్షించింది. మా కస్టమర్ సమ్మిట్‌లలో ప్రతి ఒక్కరూ ఉత్పాదక AIని కీలక థీమ్‌గా మాట్లాడుతున్నారు. కొత్త ఉత్పత్తులు, సేవల కోసం దానిని ఎలా ఉపయోగించుకోవాలా అని చూస్తున్నారు. అంతర్జాతీయంగా ఆర్థిక అనిశ్చితి నెలకొనడంతో.. ప్రాజెక్ట్‌లను ఎలా ఆప్టిమైజ్ చేయొచ్చు అనే వ్యవహారంపై చర్చలు జరుగుతున్నాయి’ అని TCS CEO తెలిపారు.
ఉద్యోగులు సహా కొత్త సాంకేతికతలపై పెట్టుబడులు పెడుతున్నట్లు కంపెనీ COO గణపతి సుబ్రహ్మణ్యం తెలిపారు. ‘మేము ఇప్పుడు లక్ష మంది బలమైన Gen-AI రెడీ కన్సల్టెంట్స్ మరియు ప్రాంప్ట్-ఇంజనీర్‌లను కలిగి ఉన్నాము. వారు ఆయా సెగ్మెంట్‌లలోని మా క్లయింట్‌ల కోసం వందలాది Gen-AI ప్రాజెక్ట్‌లను తయారుచేయడంలో నిమగ్నమై ఉన్నారు” అని ప్రకటించి ఆశ్చర్యపరిచారు.