రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మున్సిపల్ కార్యాలయం తమకు చెల్లించాల్సిన బకాయి చెల్లించకపోవడంతో రెండు రోజులుగా కరెంటు సరఫరాను సెస్ అధికారులు నిలిపివేయడంతో జనరేటర్ సాయంతో విద్యుత్ ను వినియోగిస్తున్న సంఘటన జరిగింది. గత కొన్ని నెలలుగా సెస్ కు దాదాపు రెండు కోట్ల 50 లక్షల రూపాయలు చెల్లించాల్సి ఉండగా ఎన్నోసార్లు నోటీసులు జారీ చేసినప్పటికీ కమిషనర్ గాని, చైర్ పర్సన్ గాని సరైన సమాధానం ఇవ్వకపోవడంతో విసిగి వేసారిన సెస్ అధికారులు చేసేదేం లేక మూడు రోజుల క్రితం విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. పాలకవర్గం పట్టించుకోకపోవడం, కమిషనర్ సైతం నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో సిబ్బంది జనరేటర్ సాయంతో పనులను చేస్తున్నారు. రాత్రివేళ మున్సిపల్ కార్యాలయం అంధకారంలో ఉంటుంది. వెంటనే సమస్యను పరిష్కరించాలని సంబంధిత అధికారులను విద్యుత్ శాఖ అధికారులు కోరుతున్నారు.
అంధకారంలో మున్సిపల్ కార్యాలయం…
63
previous post