తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ కార్యదర్శి శివ బాలకృష్ణను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. ఏసీబీ నిర్వహించిన దాడుల్లో ఏకంగా 100 కోట్లకు పైగా ఆదాయానికి మించిన ఆస్తులు బయటపడ్డాయి. ఆయన గతంలో హెచ్ఎండీఏ ప్రణాళిక విభాగం డైరెక్టర్ గా ఉంటూనే మరోవైపు పురపాలన, పట్టణాభివృద్ధి విభాగం ఇన్చార్జి డైరెక్టర్ హోదాలో కొనసాగారు. ఈ క్రమంలో హెచ్ఎండీఏ నుంచి రికార్డులను ఆయనే పంపేవారు. డైరెక్టర్ హోదాలో ఆయనే జీవోలిచ్చేవారు. రంగారెడ్డి, మేడ్చల్, మెదక్, భువనగిరి, సంగారెడ్డి మొత్తం ఏడు జిల్లాల్లోని భూములకు సంబంధించిన అనుమతుల్లో అక్రమాలకు పాల్పడినట్టు ఆరోపణలున్నాయి. హెచ్ఎండీఏ పరిధి జోన్లలోని నిబంధనల్ని ఆసరాగా చేసుకొని వందల దరఖాస్తులకు ఆమోద ముద్ర వేసేందుకు భారీగా వసూలు చేశారని అభియోగాలు ఉన్నాయి. ఒక్కో అంతస్తుకు 4 లక్షల వరకు లేఅవుట్లలో ఒక్కో ఎకరాకు లక్షల్లో వసూళ్లకు పాల్పడినట్లు ఆరోపణలున్నాయి. నెలకు 70-80 దస్త్రాలకు అనుమతులు మంజూరు చేస్తూ ఆస్తులు సంపాదించారని బాలకృష్ణపై అభియోగాలున్నాయి.
అక్రమాస్తుల కేసు.. శివ బాలకృష్ణ అరెస్ట్
94
previous post