90
రిపబ్లిక్ డే సందర్భంగా బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కరీంనగర్ లో జాతీయ జెండాను ఎగురవేశారు. చెక్కు చెదరని రాజ్యాంగం భారత్ సొంతమని కితాబునిచ్చారు. అత్యున్నత ప్రజాస్వామ్యానికి ప్రతీక భారత్ అని, అంబేద్కర్ రాజ్యాంగం వల్లే ఇది సాధ్యమైందన్నారు. ప్రపంచంలోని ఎన్ని దేశాలు రాజ్యాంగాన్ని అనేక సార్లు మార్చుకున్నారన్నారు. చెక్కు చెదరని భారత రాజ్యాంగాన్ని అందించిన ఘనత బాబా సాహెబ్ అంబేద్కర్ కే దక్కుతుందన్నారు. ప్రపంచంలో అత్యున్నత ప్రజాస్వామ్యానికి భారత్ తల్లిగా విరజిల్లుతోందంటే అందుకు కారణం రాజ్యాంగమేనని బండి సంజయ్ వ్యాఖ్యానించారు.