అస్సాంలో భారత్ జోడో న్యాయ్ యాత్ర సందర్భంగా కాంగ్రెస్ వాడిన రాహుల్ గాంధీ డూప్ వివరాలను త్వరలో వెల్లడిస్తానని రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ తెలిపారు. యాత్రలో రాహుల్ గాంధీకి బదులుగా ఆయనలా కనిపించే ఓ వ్యక్తిని కాంగ్రెస్ రంగంలోకి దింపిందని ముఖ్యమంత్రి ఆరోపించారు. ఆ డూప్ పేరు, అడ్రస్ వంటి వివరాలను త్వరలో బయటపెడతానని సీఎం తెలిపారు. ఇదంతా ఊరికే చెప్పట్లేదని ఆ డూప్ ఎవరు, అతడి అడ్రస్ ఏంటి ఇవన్నీ బయటపెడతానన్నారు. సోమవారం గువాహటిలో పర్యటిస్తానని అక్కడి నుంచి తిరిగొచ్చాక రాహుల్ డూప్ పేరు, అడ్రస్ అన్నీ చెబుతానంటూ సీఎం హిమంతశర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. మనిపూర్ నుంచీ మహారాష్ట్ర వరకూ రాహుల్ గాంధీ న్యాయ యాత్ర చేపడుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయన జనవరి 18 నుంచి 25 మధ్య అస్సాంలో పర్యటించిన ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రిపై విమర్శలు గుప్పించారు. దేశంలోనే అత్యంత అవినీతిమయ ముఖ్యమంత్రి హిమంత అని మండిపడ్డారు. యాత్రకు అనుమతి ఇవ్వకుండా బీజేపీ ప్రభుత్వం అడ్డంకులు సృష్టిస్తోందని కూడా కాంగ్రెస్ ఆరోపించింది. ఇక గువాహటిలో యాత్ర సందర్భంగా పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లు దాటుకునేందుకు కాంగ్రెస్ కార్యకర్తలు ప్రయత్నించడంతో ఉద్రిక్తతలు పతాకస్థాయికి చేరుకున్నాయి. రాహుల్ గాంధీతో పాటూ మరికొందరిపై ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారు. లోక్‌సభ ఎన్నికల తరువాత రాహుల్ గాంధీ అరెస్టవుతారని కూడా సీఎం అప్పట్లో వ్యాఖ్యానించారు.
సీఎం హిమంత శర్మ సంచలన వ్యాఖ్యలు
46
previous post