మనం స్మార్ట్‌ఫోన్‌లో ఇంట్రెస్ట్‌గా సినిమా లేదా ఏదైనా వీడియో చూస్తున్నప్పుడు మధ్యలో యాడ్స్ వచ్చి విసిగిస్తుంటాయి. ఈ సమయంలో ఆ యాడ్ కంప్లీట్ అయ్యే వరకు మళ్లీ ఆ వీడియో చూడలేం. ఇలాంటి సమయంలో ఫోన్ ఉపయోగించేటప్పుడు యాడ్లు వస్తే ఫోన్ నేలకేసి కొట్టాలన్నంత కోపం వస్తుంది. యాడ్స్ కారణంగా ఫోన్‌లో సినిమాలు చూడటం, గేమింగ్ లేదా ఏదైనా ముఖ్యమైన పని చేయడం కష్టమవుతుంది. ఇలా జరగకుండా ఉండాలంటే మన స్మార్ట్‌ఫోన్‌లో కొన్ని సెట్టింగ్స్ చేసుకోడం ద్వారా యాడ్స్ భారీ నుండి బయటపడొచ్చు. మొదట మన స్మార్ట్‌ఫోన్ సెట్టింగ్స్ లొకి వెళ్లాలి. తర్వాత Google ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. తర్వాత మేనేజ్ గూగుల్ అకౌంట్ ఆప్షన్‌కు వెళ్లాలి. అక్కడ మీకు డేటా అండ్ ప్రైవసీ ఆప్షన్ కనిపిస్తుంది. క్రిందికి స్క్రోల్ చేస్తే సెలక్షన్ ఆఫ్ పర్సనల్ యాడ్స్ ఆప్షన్ కనిపిస్తుంది. మీకు ఏయే యాడ్స్ వస్తున్నాయో మీ యాక్టివిటీలలో ఏవి ట్రాక్ చేయబడతాయో ఇక్కడ సులభంగా చెక్ చేయవచ్చు. సెలక్షన్ ఆఫ్ పర్సనల్ యాడ్స్ ఆప్షన్ కింద మీరు మై యాడ్ సెంటర్ ఆప్షన్ చూడొచ్చు. మై యాడ్ సెంటర్ ఆప్షన్ పై క్లిక్ చేయండి. ఇక్కడ సెలక్షన్ ఆఫ్ పర్సనల్ యాడ్స్ ఆప్షన్ కనిపిస్తుంది. సెలక్షన్ ఆఫ్ పర్సనల్ యాడ్స్ ఆప్షన్ ఆఫ్ చేయండి. ఇలా చేసిన తర్వాత ఫోన్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి గూగుల్‌పై క్లిక్ చేయండి. తర్వాత డిలీట్ అడ్వర్టయిజింగ్ ఐడీ ఆప్షన్‌పై క్లిక్ చేయండి. దాన్ని ఇక్కడ తొలగించండి. యాడ్స్ నుంచి బయటపడొచ్చు.
ఫోన్ చూస్తుంటే యాడ్స్ వస్తున్నాయా.. అయితే ఇలా చెయ్యండి..!
67
previous post