వేరొకరి ఆధార్ గుర్తింపుతో కారు అద్దెకు తీసుకుని ఉడాయించిన ఇద్దరిపై ఎస్సార్నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఎసిపి వై.వి. రావు కథనం ప్రకారం జహనుమకు చెందిన మహ్మద్ ఆమేర్ అలీ ఉద్యోగాన్వేషణలో భాగంగా ఓఎల్ఎక్స్లో ఆధార్ పత్రాన్ని అప్లోడ్ చేశాడు. బండ్లగూడకు చెందిన ఉస్మాన్అలీ, అమేర్అలీ ఆ ఆధార్ను డౌన్ లోడ్ చేసుకున్నారు. అందులో పేరు తన పేరుతో కలుస్తుండటంతో నిందితుల్లో ఒకరైన ఆమేర్అలీ జూమ్ కార్ లో మోహన్ రెడ్డి అనే యజమాని నుంచి కారు అద్దెకు తీసుకుని కనిపించకుండా పోయాడు. ఇటీవల కారు యజమాని మోహన్ రెడ్డి ఎస్సార్ నగర్ సమీపంలో నిందితుడిని చూసి వెంబడించాడు. దీంతో కారుతో వేగంగా దూసుకెళ్లిన ఆమేర్ అలీ పంజాగుట్ట ప్రాంతంలో కొందరిని ఢీకొట్టాడు. స్థానికులు పట్టుకుని దేహశుద్ధి చేసి పంజాగుట్ట పోలీసులకు అప్పగించారు. పోలీసులు ఆసుపత్రికి తరలించగా అక్కడి నుంచి తప్పించుకుపోయాడు. ఈ కేసులో, తన ఆధార్తోనే కారు అద్దెకు తీసుకుని చోరీ చేశారని బాధితుడైన మహ్మద్ ఆమెర్ అలీ ఎస్సార్నగర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితులు ఆమేర్అలీ, ఉస్మాన్అలీ పై కేసు నమోదుచేశారు. వీరు మరి కొన్నిచోట్ల ఇలాగే కార్లు చోరీ చేసినట్లు తెలిపారు. Read Also..
మాస్టర్ ప్లాన్ తో కారు చోరీ..
92
previous post