కిడ్నీ స్టోన్స్‌తో చాలా మంది బాధపడతారు. కిడ్నీల్లో స్టోన్స్ ఉంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. నొప్పి ఉంటుంది. దీనిని భరించడం చాలా కష్టం. రాళ్ళ పరిమాణాన్ని బట్టి నొప్పి, ఇబ్బంది ఎక్కువగా ఉంటుంది. మీరు మందులు తీసుకుని పుష్కలంగా నీరు తాగితే సమస్య చాలా వరకూ తగ్గుతుంది. కొన్నిసార్లు సర్జరీ కూడా అవసరమవుతుంది. ముల్లంగి జ్యూస్ అనేది కిడ్నీల్లో రాళ్ళని తగ్గించడంలో హెల్ప్ చేస్తుంది. దీని కోసం రోజూ అరగ్లాసు ముల్లంగి జ్యూస్ తాగాలి. దీనిని నేరుగా తీసుకోవడం కంటే జ్యూస్ చేసి తాగడం వల్ల రాళ్ళు కరిగిపోతాయి. హార్స్‌గ్రామ్ అని పిలచే ఈ గింజల్లో పాలీఫెనాల్స్, ఫ్లేవనాయిడ్స్, స్టెరాయిడ్స్, ప్రోటీన్, ఐరన్, బి కాంప్లెక్స్, కాల్షియంలు పుష్కలంగా ఉన్నాయి. కిడ్నీల్లో రాళ్ళ ట్రీట్‌మెంట్‌లో ఇవి బాగా పనిచేస్తాయి. కాబట్టి, వీటిని తీసుకోవాలి. మజ్జిగ తాగడం వల్ల డీహైడ్రేషన్ దూరమవుతుంది. ఇందులో కాల్షియం, పొటాషియం, ఫాస్పరస్‌లు కిడ్నీలు సరిగ్గా పనిచేసి కిడ్నీల్లో రాళ్ళని దూరం చేస్తాయి. కాబట్టి, రెగ్యులర్‌గా మజ్జిగ తీసుకోవడం మంచిది. బార్లీ కూడా కిడ్నీల్లో రాళ్ళు ఏర్పడకుండా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్‌ని నివారిస్తుంది. ఇది మూత్ర విసర్జనగా పనిచేస్తుంది.మూత్ర విసర్జనని పెంచుతుంది. దీని వల్ల బాడీ నుండి ట్యాక్సిన్స్ బయటకి వెళ్తాయి. కిడ్నీ స్టోన్స్, సిస్ట్‌లకు బార్లీ వాటర్ చాలా మంచిది. బార్లీలో ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు ఎక్కువగా ఉండడం వల్ల సమస్యని తగ్గించడంలో హెల్ప్ చేస్తుంది.Read Also..
కిడ్నీ స్టోన్స్ సమస్యతో బాధపడుతున్నారా..!
102