ఏపి కార్మిక శాఖ మంత్రి మంత్రి గుమ్మనూరు జయరాం వ్యవహార శైలి మరోసారి వివాదస్పదంగా మారింది. కర్నూలు జిల్లా ఆలూరు మండలం అరికెర గ్రామానికి చెందిన వైసిపి కార్యకర్త వీరేష్‌ను మంత్రి గుమ్మనూరు జయరాం హెచ్చరించిన ఆడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అత్యుత్సాహం వద్దు..లేదంటే బ్రేకులు పడతాయి అంటూ మంత్రి గుమ్మనూరు హెచ్చరించిన ఆడియో హల్చల్ చేస్తోంది. ఇటీవల వైసిపి అధిష్టానం ఆలూరు నియోజకవర్గ సమన్వయకర్తగా విరూపాక్షిని ప్రకటించింది. ఈ నేపథ్యంలో కార్యకర్త వీరేష్ వెళ్లి విరూపాక్షిని కలిశారు. విషయం తెలుసుకున్న మంత్రి గుమ్మనూరు జయరాం …..వైసిపి కార్యకర్త వీరేష్ తో ఫోన్ లో మాట్లాడుతూ…..’ఆరోజే నాగరాజు నిన్ను చంపుతామని చెబితే.. నేనే కాపాడా…..నువ్వు అత్యుత్సాహం ప్రదర్శించొద్దు జాగ్రత్తగా ఉండు’ అని మంత్రి ఘాటుగా హెచ్చరించారు. వీరేష్ మంత్రికి సమాధానమిస్తూ..’మీ కోసం ప్రాణాలు ఇచ్చేలాగా కష్టపడ్డాం..అయినా మాకేం చేశారు. రౌడీషీటర్ జాబితాలో నుంచి నా పేరు తొలగించేలా చేయలేదని బదులిచ్చారు. దీంతో ఇపుడు ఇద్దరి మధ్య జరిగిన సంభాషణ వైరల్‌గా మారడమే కాకుండా రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
అత్యుత్సాహం ప్రదర్శించవద్దు జాగ్రత్తగా ఉండు..
73
previous post