ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌కు తెలంగాణ కేబినెట్ ఆమోదం తెలిపింది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన అసెంబ్లీలో జరిగిన సమావేశంలో మధ్యంతర బడ్జెట్‌కు మంత్రి మండలి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కేబినెట్ ఆమోదించడంతో డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క మధ్యాహ్నం 12 గంటలకు అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. అదే సమయంలో శాసన మండలిలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు బడ్జెట్ సమర్పించనున్నారు. కాగా, గత ఏడాది ప్రభుత్వం 2.90 లక్షల కోట్ల బడ్జెట్ ప్రవేశ పెట్టడంతో ఈ సారి బడ్జెట్ 3 లక్షల కోట్లు దాటనున్నట్లు తెలుస్తోంది. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఆరు గ్యారెంటీ స్కీమ్‌ల అమలుకు బడ్జెట్ కేటాయింపులపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఇక, పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టడంతో సెంట్రల్ నుండి రాష్ట్రానికి వచ్చే నిధులపై సరైన క్లారిటీ లేదు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్రం తరహాలోనే ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశపెడుతోంది. పార్లమెంట్ ఎన్నికల తర్వాత రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది.
Follow us on : Facebook, Instagram & YouTube.