నెల రోజుల పాటు దేశ రాజధానిలో 144 సెక్షన్ విధిస్తూ ఢిల్లీ పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. తమ డిమాండ్ల సాధన కోసం మంగళవారం ‘ఢిల్లీ చలో’ పేరుతో ఆందోళన చేపట్టాలని రైతులు నిర్ణయించిన నేపథ్యంలో ఈ ఆంక్షలను ప్రకటించారు. నగరంలో ట్రాక్టర్ల ప్రవేశానికి అనుమతి ఉండదని వెల్లడించారు. అలాగే తుపాకులు, మండే స్వభావం ఉన్న పదార్థాలు, ఇటుకలు, రాళ్లు, పెట్రోల్, సోడా బాటిళ్ల వంటి వాటిని వెంట తీసుకురావడాన్ని పూర్తిగా నిషేధించారు. లౌడ్ స్పీకర్ల వాడకంపైనా ఈ ఆంక్షలు వర్తిస్తాయని తెలిపారు. రేపు ‘ఢిల్లీ చలో’ పేరుతో ఆందోళన చేపట్టాలని అన్నదాతలు నిర్ణయించిన నేపథ్యంలో అప్రమత్తమయ్యిన హర్యానా, ఢిల్లీ పోలీసులు. పలుచోట్ల సరిహద్దులను మూసివేస్తూ భారీగా బలగాలను మోహరిస్తున్నారు. ‘ఢిల్లీ చలో’ ఆందోళనలో పాల్గొనేందుకు వివిధ రాష్ట్రాల నుంచి దాదాపు 20వేల మంది రైతులు ఢిల్లీకి వచ్చే అవకాశాలు ఉన్నాయని నిఘా వర్గాలు అంచనా వేస్తున్నాయి.
మరిన్నితాజావార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Follow us on : Facebook, Instagram & YouTube.