అన్నదాతలు (Farmers) ఢిల్లీ వైపు పాదయాత్ర:
కేంద్ర ప్రభుత్వంతో చర్చలు విఫలం కావడంతో అన్నదాతలు మళ్లీ పోరుబాట పట్టారు. శాంతియుతంగా ఢిల్లీ వైపు పాదయాత్రను ప్రారంభిస్తామని పునరుద్ఘాటించారు. అయితే రైతుల ముసుగులో అరాచక శక్తులు విధ్వంసం సృష్టించే అవకాశముందని కేంద్ర నిఘా సంస్ధలు భావిస్తున్నారు. దీంతో పంజాబ్ ప్రభుత్వానికి కేంద్ర హోంశాఖ లేఖ రాసింది. శంభు బోర్డర్ నుంచి రైతులు ఢిల్లీ రావడంపై లేఖలో తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఉపేక్షించొద్దని లేఖలో కోరింది. రైతుల ముసుగులో సంఘవిద్రోహ శక్తులు.. అశాంతి సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని హెచ్చరించింది. 14 వేల మంది రైతులు 1200 ట్రాక్టర్లు, 300 కార్లు, 10 బస్సుల్లో శంభు బోర్డర్ దగ్గరకు చేరుకున్నారు. కనీస మద్దతు ధరపై చట్టం చేసే అంశంపై తమ డిమాండ్లపై కేంద్రం ప్రకటన చేయాలని రైతులు పట్టుబడుతున్నారు. భారీగా రైతులు శంభు బార్డర్కు చేరుకోవడంతో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. Read Also..
Follow us on : Facebook, Instagram & YouTube.
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.