బాలికల గురుకుల విద్యాలయం (Girls Gurukula Vidyalaya):
ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం అడవి మల్లెల బాలికల గురుకుల విద్యాలయంలో యాన్యువల్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్ గా సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్ట రాగమయి దయానంద్ పాల్గొన్నారు. యాన్యువల్ డే సందర్భంగా విద్యార్థులు అంతా పండగ వాతావరణం లో సందడి చేస్తూ విశిష్ట అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే డాక్టర్ మట్ట రాగమయి దయానందుకు గ్రాండ్ వెల్కమ్ పలికారు. ఎమ్మెల్యే పాఠశాలలో ఏర్పాటుచేసిన ఫోటో ఎగ్జిబిషన్ స్టాల్స్ ను సందర్శించారు. అనంతరం విద్యార్థులు చేసిన నృత్యాలు అందరిని అలరించాయి. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ మాట్లాడుతూ.. గురుకులాల్లో చదువుతున్న విద్యార్థులపై చదువుల ఒత్తిడి ఉండదని.. అనేక రకాల సాంస్కృతిక, వైజ్ఞానిక వంటి కార్యక్రమాలతో విద్యార్థులపై పడుతున్న ఒత్తిడిని తగ్గించి మానసికంగా ఉత్తేజపరిచి వారి భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తున్నామన్నారు.
Follow us on : Facebook, Instagram & YouTube.
ఎమ్మెల్యే రాగమయి దయానంద మాట్లాడుతూ.. తాను చదువుకునే రోజుల్లో యాన్యువల్ డే అంటే మీలాగే ఎంజాయ్ చేసే దానిని అంటూ తన స్కూల్ రోజులను గుర్తు చేసుకున్నారు. స్కూల్ వాతావరణం ఎంతో ఆహ్లాదకరంగా ఉందని ఇక్కడ విద్యార్థులు కూడా అంతే స్థాయిలో యాక్టివ్ గా ఉన్నారని ప్రశంసించారు. పాఠశాలకు కావలసిన ప్లే గ్రౌండ్, వాటర్ సమస్య ను అప్పటికప్పుడే అధికారులకు ఫోన్లో మాట్లాడి పరిష్కరించారు. చదువులు పట్ల ఆడవారిపై ఉన్న అపోహలు తొలగిపోయేలా ప్రతి ఒక్కరూ మంచిగా చదవాలని విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో గురుకుల విద్యాలయాల ఆర్ సి ఓ, పాఠశాల సిబ్బంది, విద్యార్థుల తల్లిదండ్రులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. Read Also..
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.