గత పది రోజులుగా మెట్ట ప్రాంతంలో పెద్దపులి సంచారం చేస్తుండటంతో ప్రజలు భయాందోళనకు గురైతున్నారు. అయితే తాజాగా తూర్పుగోదావరి జిల్లా తాళ్లపూడి మండలం మలకపల్లి గ్రామంలో పులి పాదమూద్రలు మళ్లి ప్రత్యక్షమయ్యాయి. ఉదయం పొలం పనులకు వెళ్లిన రైతుకు పెద్దపులి పాదముద్రలు కనిపించాయి.
భువనేశ్వరి వ్యాఖ్యలపై రోజా కౌంటర్
అవి చూసి భయాందోళన గురైన రైతులు ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు పులి పాదముద్రలను తనిఖీ చేసి గుర్తించారు. పెద్దపులి సంచారం పై ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని ఫారెస్ట్ అధికారులు సూచించారు. అంతేకాక రైతులు తెల్లవారికే పొలాల్లోకి వెళ్లి పనులు చేసుకోవాలన్ని అధికారులు తెలిపారు.
Follow us on : Facebook, Instagram & YouTube.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.