126
ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో ఓ మావోయిస్టు చనిపోయాడు. ఈ ఉదయం సుక్మా జిల్లాలోని బుర్కలంకా అటవీ ప్రాంతంలో డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్స్ జవాన్లు గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో వారికి తారసపడిన మావోయిస్టులు.. కాల్పులు జరిపి అక్కడి నుంచి పారిపోయారు. ప్రతిగా పోలీసులు జరిపిన ఎదురుకాల్పుల్లో ఓ మావోయిస్టు మరణించాడని జిల్లా ఎస్పీ కిరణ్ చౌహాన్ చెప్పారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు. అతడిని గుర్తించాల్సి ఉందన్నారు. ఆ ప్రాంతంలో ఇంకా గాలింప కొనసాగుతోందని ఎస్పీ తెలిపారు.
Follow us on : Facebook, Instagram & YouTube.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.