కుప్పం (Kuppam) నియోజకవర్గం:
కుప్పం నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం హంద్రీ – నీవా కాలువ పూర్తి చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి.. రేపు 26 న రాష్ట్ర ముఖ్యమంత్రి వై. యస్. జగన్ మోహన్ రెడ్డి కుప్పం నియోజకవర్గం శాంతిపురం, రామకుప్పం మండలాలలో పర్యటించనున్న నేపథ్యంలో అన్ని ఏర్పాట్ల ను చేయడం జరుగుతున్నదని రాష్ట్ర అటవీ, విద్యుత్, పర్యావరణ, శాస్త్ర సాంకేతిక, భూగర్భ గనులు శాఖ మంత్రి డా. పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి పేర్కొన్నారు.
రాష్ట్ర అటవీ, విద్యుత్, పర్యావరణ, శాస్త్ర సాంకేతిక, భూగర్భ గనులు శాఖ మంత్రి, డిప్యూటీ సిఎం కె.నారాయణస్వామి తో కలసి ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్ల పరిశీలనలో భాగంగా శాంతిపురం మండలం, గుండె శెట్టి పల్లి బహిరంగ సభ వద్ద జరుగు తున్న ఏర్పాట్లను మరియు రామకుప్పం మండలం రాజుపేట వద్ద శరవేగంగా జరుగుతున్న హంద్రీనీవా కాలువ పనులను మంత్రులు పరిశీలించారు.
Follow us on : Facebook, Instagram & YouTube.
ఈ సందర్భంగా రాష్ట్ర అటవీ, విద్యుత్, పర్యావరణ, శాస్త్ర సాంకేతిక, భూగర్భ గనులు శాఖ మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి గతంలో కుప్పం పర్యటనలో ఇచ్చిన మాట ప్రకారం నీటిని కుప్పం నియోజకవర్గానికి నీరు అందించడంలో భాగంగా హంద్రీ – నీవా కాలువ నిర్మాణం పూర్తి చేయడం జరిగిందన్నారు. ఈ కాలువ ద్వారా కుప్పం నియోజకవర్గంలో దాదాపు 54 చెరువులకు నీరు అందించే పరిస్థితి ఉందన్నారు. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా కుప్పం నియోజకవర్గ ప్రజల చిరకాల వాంఛను నెర వేర్చెలా రామకుప్పం లో పూజా కార్యక్రమం నిర్వహించి హంద్రీ – నీవా నీటిని విడుదల చేయడం జరుగుతుందన్నారు. పాలారు ప్రాజెక్టు కూడా శంఖుస్థాపన చేయడం జరుగుతుందని, ఈ ప్రాజెక్టు పూర్తి అయినట్లైతే హంద్రి – నీవా, పాలారు ప్రాజెక్టుల ద్వారా సాగు నీరు, త్రాగు నీరు కు ఇబ్బంది ఉండదని తెలిపారు. గాండ్ల కమ్యూనిటి భవన నిర్మాణానికి అవసరమైన భూమిని కేటాయించి రూ.3 కోట్లు నిధులు విడుదల చేసి భవన నిర్మాణం త్వరితగతిన పూర్తి చేస్తామని తెలిపారు. Read Also..
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.