కోర్టు తీర్పుపై హిందూ వర్గాలు సంతోషం వ్యక్తం:
జ్ఞానవాపి మసీదు కాంప్లెక్స్‌లోని ‘వ్యాస్ కా తేఖానా’లో హిందువులు పూజలు చేసుకోవచ్చంటూ వారణాసి కోర్టు ఇచ్చిన తీర్పును అలహాబాద్ హైకోర్టు సమర్థించింది. వారాణాసి కోర్టు ఆదేశాలపై స్టే ఇవ్వాలన్న అంజుమన్ ఇంతెజామియా మసీద్ కమిటీ – ఏఐఎంసీ అభ్యర్థనను తోసిపుచ్చింది. తుది వాదనలు విన్న జస్టిస్ రోహిత్ రంజన్ అగర్వాల్ ఈ మేరకు తీర్పు వెల్లడించారు. కోర్టు తీర్పుపై హిందూ వర్గాలు సంతోషం వ్యక్తం చేశాయి.
రాహుల్ గాంధీపై బెంగళూరు స్పెషల్ కోర్టు ఉత్తర్వులు జారీ
వివాదస్పదమైన జ్ఞానవాసీ మసీదును ఆలయాన్ని కూలగొట్టి నిర్మించారని హిందువులు వారణాసి జిల్లా కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన జిల్లా కోర్టు.. మసీదు సెల్లార్‌లో పూజలు చేసుకునేందుకు వారణాసి జిల్లా కోర్టు పర్మిషన్ ఇచ్చింది. అయితే ఈ తీర్పును సవాల్ చేస్తూ అలహాబాద్ హైకోర్ట్ లో పిటీషన్ దాఖలుచేశారు. మసీదు కమిటీ వేసిన పిటిషన్‌ను కొట్టి వేసి హిందువులు పూజలు చేసేందుకు హైకోర్ట్ అనుమతి ఇచ్చింది. దీంతో మసీదు కమిటీ సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని తెలిపింది.
Follow us on : Facebook, Instagram & YouTube.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.