తెలంగాణలో ఇంటర్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్ పరీక్షల కోసం 1521 సెంటర్లను ఏర్పాటు చేశారు అధికారులు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష జరుగుతుందని నిమిషం ఆలస్యమైన ఎగ్జామ్ సెంటర్ లోకి అనుమతించేది లేదన్నారు అధికారులు. మార్చి 19 వరకు ఇంటర్ పరీక్షలు జరగనున్నాయి. ఇంటర్ ఫస్ట్, సెకండియర్ పరీక్షలకు 9లక్షల 80 వేల 978 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు అవుతారని అధికారులు తెలిపారు. ఇంటర్ పరీక్షలకు 1,521 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామని తెలిపారు.
ఇది చదవండి: ఆ రెండు పార్టీలు తోడు దొంగలే…
1521 మంది చీఫ్ సూపరింటెండెంట్లను, ఇదే సంఖ్యలో ప్రభుత్వ అధికారులను పరీక్షలకు వినియోగిస్తున్నారు. ప్రతీ పరీక్ష కేంద్రంలోనూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు చేరుకోవడానికి టీఎస్ ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. పరీక్ష కేంద్రాలలో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నామని అధికారులు తెలిపారు. పరీక్ష హాల్ లోకి మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలు తీసుకుని రావొద్దన్నారు. హాల్ టికెట్లు ఇవ్వడానికి కాలేజీలు నిరాకరిస్తే ఇంటర్ బోర్డ్ దృష్టికి తీసుకురావాలని అధికారులు సూచించారు.
Follow us on : Facebook, Instagram & YouTube.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.