ఏపీలో ఇంటర్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. తొలిరోజు పరీక్షల కోసం సెట్ వన్ ఎంపిక చేసినట్టు ఇంటర్ బోర్డు కార్యదర్శి సౌరభ్ గౌర్ ప్రకటించారు. ఈరోజు మొదటి ఏడాది విద్యార్ధులకు పరీక్షలు ప్రారంభం కానుండగా, రేపు రెండో ఏడాది విద్యార్థులకు పరీక్షలు మొదలవుతాయి. ఈ విద్యా సంవత్సరంలో మొత్తం 10 లక్షల 52 వేల 221 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారు. మొత్తం 26 జిల్లాల్లో 1,559 సెంటర్లను పరీక్షలకు సిద్ధం చేశారు.
ఇది చదవండి: చెరువు రక్షణ కోసం ప్రాణ త్యాగానికైనా సిద్ధం – బడి సుధాయాదవ్
ఇంటర్మీడియట్ బోర్డు నుంచి ప్రతి జిల్లాకు ఇద్దరు అధికారులను పంపించారు. రాష్ట్ర వ్యాప్తంగా పరీక్షలు జరిగే ప్రతి తరగతి గదిలో సీసీటీవీ కెమేరాలను ఏర్పాటు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 22 వేల కెమెరాలతో పరీక్షల్లో నిఘా ఉంచారు. పరీక్షల సరళిని పర్యవేక్షించేం దుకు ప్రతి జిల్లాలోనూ ఓ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్టు ఇంటర్ బోర్డు ప్రకటించింది. ఇంటర్ పరీక్షల్లో అవకతవకల్ని నిరోధించడంతో పాటు పేపర్ లీక్ అరికట్టడానికి ఇంటర్ బోర్డు పకడ్బందీ చర్యలు చేపట్టింది. పరీక్షల్లో ‘డిజిటల్ నిఘా’ను ఏర్పాటు చేసింది.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి