Bhumana Abhinay :
భూమన అభినయ్ కి తిరుపతిలో బలిజ కులస్థులంతా అండగా ఉండాలని ఏకగ్రీవంగా తీర్మానించారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో భూమన అభినయ్ కి బలిజ కులస్థులంతా ఓట్లు వేసి భారీ మెజారిటీతో గెలిపించుకోవాలని నిర్ణయించారు. గతంలో తమ కులానికి చెందిన ప్రజా ప్రతినిధులు, టీటీడీ చైర్మన్ లు కూడా తమకు న్యాయం చేయలేదని, భూమన కరుణాకర రెడ్డి, భూమన అభినయ్ ఆధ్వర్యంలో బలిజ కులస్థులకు న్యాయం చేశారని కొనియాడారు. బలిజ కులస్థులను ఇంతగా ఆదరించిన వారు లేరన్నారు. బలిజ కులస్థులుగా తమపై భూమన కుటుంబం ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా, భూమన అభినయ్ విజయం కోసం అంకిత భావంతో కృషి చేద్దామని పిలుపు నిచ్చారు. తిరుపతి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి భూమన అభినయ రెడ్డి మాట్లాడుతూ మా కుటుంబాన్ని కాపు గాచిన కాపు సామాజిక వర్గ ప్రజలను ఎన్నటికీ మరవను అని మీరు చూపిన ప్రేమ, ఆదరణాభిమానాలు అంతా ఇంతా కాదు అని, మీకు ఎంత చేసినా మీ రుణాన్ని ఎన్నటికీ తీర్చుకోలేను అని భూమన అభినయ్ అన్నారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
మన అభిమాన నాయకుడు భూమన కరుణాకర రెడ్డి విజయంలో మీరు కీలక పాత్ర పోషించారు. ఈ ఎన్నికల్లో నాకు మీ అందరి మద్దతు ఇవ్వమని నేను అభ్యర్థిస్థున్నా అందరి సహకారంతో తిరుపతిలో 18 మాస్టర్ ప్లాన్ రోడ్లు వేసి, అభివృద్ధి చేశాం. తిరుపతి ని మరింతగా మారుస్తానని మీకు హామీ ఇస్తున్నా అన్నారు. నా వైపు నిలబడమని విజ్ఞప్తి చేస్తున్నాను. నా గురించి నలుగురికి చెప్పండి, నా గెలుపు కోసం కృషి చేయండి. మీకు రుణ పడి ఉంటానని అభినయ రెడ్డి అన్నారు. భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ భూమన అభినయ్ విజయం ఆకాంక్షించి, బలిజ సామాజిక వర్గమంతా ఏక తాటిపై నిలబడుతున్నందుకు సంతోషంగా ఉందని, నేడు జరిగిన బలిజ కులస్థుల ఆత్మీయ సమావేశంలో అంత చక్కటి ప్రసంగాలతో మా పై ఉన్న అభిమానాన్ని మరో సారి చాటుకున్న ప్రతి ఒక్కరికీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర రెడ్డి కృతజ్ణతలు తెలిపారు.
భూమన అభినయ్ కి మద్ధతుగా నిలబడి, ఎన్నికల్లో ఓట్లు వేసి గెలిపించాలని ప్రజలంతా కలిసి ఉంటే ఎలా మంచి జరుగుతుంది అనేందుకు తిరుపతి అభివృద్ధి చక్కటి ఉదాహరణ అన్నారు. 75 ఏళ్లలో జరగని అభివృద్ధి, జగనన్న చొరవ, ఈ రోజు మీ అందరి సహకారం తోనే జరిగిందన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గా నియమితులైనప్పటి నుంచి ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చానని, అటు ఉద్యోగులు, ఇటు భక్తులు నాపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా కృషి చేశానని, ఇన్ని ఆలోచనలు ఉన్న నా కంటే మన భూమన అభినయ్ ఇంకా గొప్పగా ఆలోచించ గలవాడు, భూమన అభినయ్ ని ఎమ్మెల్యే గా గెలిపించుకుంటే నా కంటే గొప్పగా ప్రజలకు సేవ చేయగలడు అని అన్నారు. ఈ కార్యక్రమంలో నీలం బాలాజి, తిరుమల నిర్వాసితులు చిన్నమని, బెల్లం రమేష్, ప్రవీణ్ రాయల్, ప్రవీణ్, చంద్ర రాయల్, రాము తదితర తిరుమల నిర్వాసితులు, తిరుపతి బలిజ సంఘం నాయకులు, మహిళలు పాల్గొన్నారు.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి