Muppavula Nageswara Rao :
నంద్యాల జిల్లా డోన్ సిపిఐ పార్టీ కార్యాలయం లో సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పావుల నాగేశ్వర రావు మాట్లాడుతూ ఇప్పుడు ఎన్నికల హడావుడి చేస్తున్నారని దేశంలో బిజెపికి 370 సీట్లు వస్తాయని ఎన్డీఏ కూటమికి 410 సీట్లు వస్తాయని, దేశ కీర్తి ప్రతిష్టలు తారస్థాయికి తీసుకెళ్లారని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గొప్ప రాజకీయవేత్త అని చెప్పుకుంటున్న బిజెపి నాయకులు మరి దేశంలో రూపాయి విలువ ఎందుకు పడిపోయిందో దేశ ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం మోడీకి, హోమ్ శాఖ మంత్రికి, ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందని ముప్పావుల నాగేశ్వర రావు డిమాండ్ చేశారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
2014 లో డాలర్ విలువ 54 రూపాయలు ఉండేదని అది ఇప్పుడు 83 రూపాయల 12 పైసలు పెరిగిందని ముప్పావుల నాగేశ్వర రావు తెలిపారు. బిజెపి అధికారం రాకముందు వంట గ్యాసు 420 రూపాయలు ఉండిందని అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ 20 రూపాయలు పెంచితే ప్రతి బిజెపి నాయకుడు నెత్తి మీద సిలిండర్ పెట్టుకుని ప్రచారం చేశారని మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత వంట గ్యాస్ ధర 1060 రూపాయలు చేసినది మర్చిపోయారని, వామపక్ష పార్టీలు భారీ ధర్నాలు చేస్తే ఇప్పుడు వంట గ్యాస్ ధర 912 రూపాయలు ఉందని కాంగ్రెస్ గవర్నమెంట్ లో 420 రూపాయలు ఎక్కడ ఇప్పుడు బిజెపి గవర్నమెంట్ లో 912 రూపాయలు ఎక్కడా అని ముప్పావుల నాగేశ్వరరావు మండిపడ్డారు.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఇది చదవండి : ఎన్నికల శంఖారావాన్ని ప్రారంభించిన కాల్వ శ్రీనివాసులు…
అదే విధంగా దేవుడిని అడ్డం పెట్టుకుని రాజకీయం చేస్తున్నాడని ఇది మంచి పద్ధతి కాదని మోడీ కి ముప్పావుల నాగేశ్వరరావు పేర్కొన్నారు. అదే విధంగా మన రాష్ట్రంలో చెట్టు పేరు చెప్పి కాయలమ్ముకుంటున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని ముప్పావుల నాగేశ్వరావు అన్నారు. మన రాష్ట్ర సీఎం జగన్మోహన్ రెడ్డి పోలీసులను అడ్డు పెట్టుకొని రాజకీయం చేయడం ఏమిటని అదే విధంగా సి ఐ డి ని కూడా అడ్డు పెట్టుకొని రాజకీయం చేస్తున్నారని రాష్ట్రంలో ఎదిరించి ధర్నాలు చేస్తే నియంత్రించే హక్కు నీకు ఎవరు ఇచ్చారని అంబేద్కర్ రచించిన రాజ్యాంగంలో దేశంలో రాష్ట్రంలో ఉన్నామని ముప్పావుల నాగేశ్వరరావు తెలిపారు. అదే విధంగా బిజెపి పొత్తు కొరకు రహదాలాడుతున్నటీడీపీ అయితే నేమి జనసేన అయితే నేమి మాకు జన ఆదరణ ఉందని చెప్పుకుంటున్న నాయకులు బిజెపితో చీకటి ఒప్పందం ఏంటని ముప్పావుల నాగేశ్వరావు పేర్కొన్నారు. బిజెపితో ఎటువంటి ఒప్పందం లేకుండా కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో గెలిచింది. కేంద్రంలో బిజెపి రాష్ట్రంలో బిజెపి ఉన్న కర్ణాటక రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ గెలిచింది. మమత బెనర్జీ పంతం కట్టుకున్న బిజెపి మమతలు ఓడించలేదే ముప్పావుల నాగేశ్వరరావు పేర్కొన్నారు. దేశంలో పెద్దనాయిని రాష్ట్రంలో కొడుకును ఇద్దరినీ ఇంటికి పంపించే కి ప్రజలు సిద్ధంగా ఉన్నారని ముప్పావుల నాగేశ్వరావు తెలిపారు. సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్ పొత్తులో భాగంగా డోన్ సీటు సిపిఐ పార్టీ కి కావాలని డిమాండ్ చేస్తున్నామని ముప్పావుల నాగేశ్వరావు తెలిపారు. అదేవిధంగా ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన పడిపోయిన మార్కెట్లను పెచ్చులు ఉడిపోయిన గెస్ట్ హౌస్, హాస్పిటల్ ఇదే నీ అభివృద్ధి అని ముప్పావుల నాగేశ్వరరావు విరుచుకుపడ్డారు.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి