శ్రీకాళహస్తి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈరోజు సాయంత్రం 4 గంటల నుండి భక్త కన్నప్ప ధ్వజారోహణం అంకురార్పణ తో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి.
బ్రహ్మోత్సవాలలో రోజు వారి కార్యక్రమాల వివరాలు :
మొదటి రోజు తేది 03 న ఆదివారం సాయంత్రం 4 గంటలకు శ్రీకన్నప్ప ద్వజారోహణం, అంకురార్పణ
రెండవ రోజు తేది 04 న సోమవారం (దేవ రాత్రి) ఉదయం 8.30 గం.లకు వెండి అంబారి వాహన సేవ, మద్యాహ్నం 12.30 గం.లకు శ్రీస్వామి వారి ద్వజారోహణం ప్రారంభం, రాత్రి 8 గం.లకు వెండి అంబారి సేవ
మూడవ రోజు తేది 05 న (భూత రాత్రి) మంగళవారం ఉదయం 9 గం.లకు సూర్యప్రభ – చప్పర వాహన సేవ, రాత్రి 8 గం.లకు భూత – శుక్ర వాహన సేవ
నాల్గవ రోజు తేది 06 న (గాంధర్వ రాత్రి) బుధవారం ఉదయం 9 గం.లకు హంస – యాళి వాహన సేవ, రాత్రి 8 గం.లకు రావణుడు – మయూర వాహన సేవ
ఐదవ రోజు తేది 07 న ( నాగ రాత్రి) గురువారం ఉదయం 9 గం.లకు హంస – శుక్ర వాహన సేవ, రాత్రి 8 గం. లకు శేష వాహనం – యాళి వాహన సేవ
ఆరవ రోజు తేది 08 న (మహా శివరాత్రి) శుక్రవారం ఉదయం 10.30 గం.లకు ఇంద్ర విమానం – చప్పర సేవ, రాత్రి 9.30 గంటలకు నంది – సింహ వాహన సేవ
ఏడవ రోజు తేది 09 న (బ్రహ్మ రాత్రి) శనివారం ఉదయం 11 గం.లకు రథోత్సవం, రాత్రి 8 గం.లకు తెప్పోత్సవం
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
ఎనిమిదవ రోజు తేది 10 న (స్కంద రాత్రి) ఆదివారం శ్రీస్వామి అమ్మవార్ల కల్యాణోత్సవం ఉదయం 9 గంటలకు అధికార నంది– కామధేనువు వాహనం, రాత్రి 9. గం.లకు గజ – సింహ వాహన సేవ
తొమ్మిదవ రోజు తేది 11 న (ఆనంద రాత్రి) సోమవారం ఉదయం 11 గం. లకు రుద్రాక్ష అంబారి వాహన సేవ, రాత్రి 7గం.లకు శ్రీసభాపతి కల్యాణం
పదవ రోజు తేది 12 న (ఋషి రాత్రి) మంగళవారం కైలాస గిరి ప్రదక్షిణ (కొండ చుట్టు) ఉదయం 7.15 గం.లకు ఐనాత అంబారి వాహన సేవ, రాత్రి అశ్వం – సింహ వాహన సేవ ప్రారంభం.
పదకొండవ రోజు తేది 13 న (దేవ రాత్రి) బుధవారం మద్యాహ్నం 11.30 గం.లకు తీర్థవారి ద్వజావరోహణం
పన్నెండవ రోజు తేది 14 న గురువారం రాత్రి 8 గం.లకు పల్లకీ సేవ
పదమూడవ రోజు తేది 15 న (మోహ రాత్రి) శుక్రవారం రాత్రి 9 గం.లకు ఏకాంత సేవ
14 వ రోజు తేది 16 న శనివారం ఉదయం 9.30 గంటలకు శాంతి అభిషేకంతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి.
ఇది చదవండి: జగన్ కు అచ్చెన్నాయుడు బహిరంగ లేఖ..
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి