విశాఖ జిల్లా(Visakhapatnam):
విశాఖ జిల్లా(Visakhapatnam) గాజువాక(Gajuvaka) వైసీపీ(YCP) నేతల మధ్య విభేదాలు తారస్థాయికి చేరుకున్నాయి. నియోజకవర్గ సమన్వయకర్తను మార్చినప్పటి నుంచి నివురుగప్పిన నిప్పులా వున్న విభేదాలు ఇప్పుడు బయటపడుతున్నాయి. ఎవరికి వారు వేర్వేరుగా పార్టీ కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నారు. పార్టీకి నష్టం కలిగించేలా వ్యవహరిస్తున్నారంటూ ఒకరిపై ఒకరు బహిరంగంగానే విమర్శలు చేసుకుంటున్నారు.
టికెట్‌పై ఎవరికి వారే ధీమా వ్యక్తం..
సిట్టింగ్ ఎమ్మెల్యే నాగిరెడ్డి(MLA Nagireddy), ప్రస్తుత ఇన్‌ఛార్జి ఉరికిటి చందు మధ్య వైరం తారాస్థాయికి చేరుకుంది. టికెట్‌పై ఎవరికి వారే ధీమా వ్యక్తం చేశారు. గాజువాక సీటు తమ నాయకుడిదేనని నాగిరెడ్డి వర్గం వెల్లడించింది. అయితే గతంలోనే గాజువాక అభ్యర్థి చందు అంటూ వైవీ సుబ్బారెడ్డి(YV Subbareddy) ఓ ప్రకటన చేశారు. దీంతో కార్పొరేటర్ల మద్దతుతో ఉరికిటి చందు జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. మరో నెల రోజుల్లో ఎన్నికలు జరగబోతుంటే నేతల మధ్య ఈ కుమ్ములాటలు ఏమిటంటూ కార్యకర్తలు తలలు పట్టుకుంటున్నారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
ఇది చదవండి: జనంలోకి జనసేన కార్యక్రమం..
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి.