శ్రీ కాళహస్తీశ్వరాలయం (Srikalahasteeshwaralayam) :
దేవుడంటే అందరికీ సమానమే.. పేద ధనిక అంటూ దేవుడు ముందు ఉండకూడదూ.. కానీ శ్రీ కాళహస్తీశ్వరాలయంలో వెలసిన శివయ్యను పాలకులు… అధికారులు కొందరికే అన్న విధంగా చేస్తున్నారు. భక్తులకు స్వామిని దూరం చేసే విధంగా వ్యవహరిస్తూ ఎన్నో ఏళ్ల ఆచరాలను, సంప్రదాయాలకు తూట్లు పొడుస్తూ అపఖ్యాతి మూటకట్టుకుంటున్నారు. భక్తుల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. శనివారం ఉదయం లింగోద్భవ దర్శనం చూస్తామని ఎంతో ఆశపడ్డ భక్తులకు ఆలయాధికారులు మొండిచెయ్యి చూపించారు. ఆలయానికి ప్రధానంగా వచ్చే సుభదమండపం తలుపులు మూసివేసి లోపల అభిషేక కార్యక్రమాలు తిలకించారు.. పర్వదినోత్సం నాడు ప్రశాంతంగా జరగాల్సిన కార్యక్రమం కొందరి తీరుతో అబాసుపాలైంది. భక్తుల నిరసనలు, నినాదాలతో ఆలయం మొత్తం దద్దరిల్లిపోయింది. ప్రతి ఏటా జరిగే బ్రహ్మోత్సవాల్లో లింగోద్భవం దర్శనానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
ఆలయంలో ఉదయం నుంచి పది కాలల అభిషేకం నిర్వహిస్తారు. ఆ తర్వాత 11వకాల అభిషేకం నిర్వహించి లింగోద్భవ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఈ ఉత్సవాన్ని తిలకించేందుకు దేశవ్యాప్తంగా భక్తులు ఆలయానికి పోటేత్తుతుంటారు. ప్రతి ఏడాది ఏదో ఒక సమస్య వస్తున్నా అధికారుల్లో ఏ మాత్రం కనిపించడం లేదు. ఎన్ని విమర్శలు వస్తున్నా సక్రమంగా కార్యక్రమాన్ని నిర్వహించలేకపోతున్నారు. ఉదయం రెండు నుంచి నాలుగు గంటల వరకు లింగోద్భవం ఉంటుందని చెప్పగా ఆ ప్రకారం వేలాది మంది భక్తులు ఆలయానికి వచ్చారు. ఉదయం రెండు గంటల నుంచి వేచి ఉన్నా అధికారులు తలుపులు తెరవలేదు. రెండు మూడు ద్వారాల్లో తలుపులు తెరిచినా, కొందరు వెళ్లిపోగానే వాటిని మూసివేశారు. అలాగే ప్రధాన ద్వారాన్ని కూడా మూసివేశారు. లోపలే తిష్టవేసిన పలువురు నాయకులు తమకు అయిన వారందరిని ఆలయంలోకి రాచమర్యాదలతో స్వాగతం పలికిదర్శనాలు చేయించుకున్నారు. రెండు గంటల నుంచి నాలుగు గంటల వరకు అభిషేక సమయం ముగిసిపోతున్నా పోలీసులు తలుపులు తెరవలేదు.
ఇది చదవండి : ఇంకోసారి దీవించండి…ఇప్పటి కంటే రెట్టింపు పని చేస్తా…
దీంతో కోపం కట్టలు తెంచుకున్న భక్తులు పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆలయ ఈవో నాగేశ్వరరావుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వీఐపీల తీరుపై కూడా మండిపడ్డారు. దూర ప్రాంతాల నుంచి స్వామి వారిని దర్శించుకుందామని వస్తే ఇలాగా చేసేది అంటూ మండిపడ్డారు లోపలకు అనుమతించాలంటూ పోలీసులను ప్రాధేయపడ్డారు. కానీ ఒక్కరంటే ఒక్కరు కూడా సమాధానం చెప్పని పరిస్థితి. దీంతో చేసేది లేక భక్తులందరూ మాకుమ్మడిగా ఈవో డౌన్ డౌన్ అంటూ ఓం నమఃశివాయ అంటూ గట్టిగా నినాదాలు చేస్తూ లోపలకు వెళ్లేందుకు ప్రయత్నించారు. కానీ అధికారులు లోపలకు పంపలేదు. లింగోద్భవ దర్శనం పూర్తయ్యాక తలుపులు తీసి లోపలకు అనుమతించారు. దీనిపై భక్తులు ఇదేం పద్దతి అంటూ పోలీసులను, అధికారులను నిలదీయడం కనిపించింది. పాలకులు, అధికారుల తీరుతో భక్తులెవరికి ఆ భాగ్యం దక్కకుండా పోయింది. ఆలయాధికారులు ఆచరాలను మంటగలుపుతూ ఏకపక్షంగా వ్యవహరించడం ఎంత వరకు సమంజసమని పలువురు ప్రశ్నిస్తున్నారు. భక్తులకు అభిషేక దర్శనం కల్పించకుండా కొందరికే అవకాశం ఇవ్వడం దారుణమని అంటున్నారు.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి