ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్(YS Jagan) కూటమి నేతలపై వ్యాఖ్యలను తీవ్రతరం చేశారు. ముఖ్యంగా చంద్రబాబు(Chandrababu) పై విమర్శలు చేశారు. తిరుపతి జిల్లా(Tirupati District) వెంకటగిరి(Venkatagiri)లో సీఎం జగన్ ఎన్నికల ప్రచార(Election Campaign) కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎన్నికల్లో చంద్రబాబు సాధ్యం కాని హామీలతో మరోసారి మోసం చేస్తున్నారని, బాబును నమ్మడమంటే పులినోట్లో తలకాయ పెట్టినట్లేనని ఆరోపించారు. వైసీపీ అమలు చేసిన పథకాలు కొనసాగాలంటే వైసీపీ తిరిగి అధికారంలోకి రావాలని, చంద్రబాబుకు వేస్తే పథకాలు ముగింపు అవుతాయని పేర్కొన్నారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
14 ఏండ్ల పాటు సీఎంగా పనిచేసినా చంద్రబాబు గుర్తుకు వచ్చే పథకాలు ఏమైనా ఉన్నాయా అంటూ ప్రశ్నించారు. పేదలకు ఏ ఒక్క మంచి పథకాలు లేవని ఆరోపించారు. జన్మభూమి కమిటీల మీద నమ్మకం ఉంటే అధికారంలో వస్తే తిరిగి ధైర్యంగా పునరుద్దరిస్తావా లేదా అంటూ నిలదీశారు. వాలంటీర్ల వ్యవస్థను తిరిగి తీసుకొస్తానని వెల్లడించారు. 2014లోనూ జనసేన, బీజేపీతో కూటమి కట్టి ఎడాపెడా వాగ్దానాలు చేశారని, అధికారంలోకి వచ్చాక తుంగలో తొక్కి ప్రజల జీవితాలతో చెలగాటమాడారని ఆరోపించారు. రైతుల రుణమాఫీ, పొదుపు సంఘాల రుణాలు మాఫీ చేయలేదని దుయ్యబట్టారు. ఈ ఎన్నికలు తలరాతలు రాసే ఎన్నికలని, ప్రజలు ఆలోచించి మంచి చేసే పార్టీకి ఓటు వేయాలని కోరారు.
- రేపు ముంబైకి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ రేపు మరోసారి ముంబైకి వెళ్లనున్నారు. కొంతకాలంగా రొటేటర్ కఫ్ గాయంతో బాధపడుతున్న ఆయన..భుజాలకు సంబంధించిన చికిత్స చేయించుకోనున్నారు. రెండు భుజాల కండరాలు దెబ్బతినడంతో ఇబ్బంది పడుతున్న పవన్ కల్యాణ్..ముంబై హాస్పిటల్లో ఇప్పటికే వైద్య పరీక్షలు…
- అమరావతిలో దేశంలోనే తొలి శాటిలైట్ ఆధారిత హెలిపోర్ట్.ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అభివృద్ధిలో మరో కీలక అడుగు పడుతోంది. ఇప్పటికే కేంద్ర కార్యాలయాలు, బ్యాంకులు, హోటల్స్, విద్యా సంస్థలతో రూపుదిద్దుకుంటున్న రాజధాని ప్రాంతానికి ఇప్పుడు హైటెక్ స్కై కనెక్టివిటీ కూడా అందుబాటులోకి రానుంది. ఉండవల్లి సమీపంలో ఆధునిక సదుపాయాలతో హెలిపోర్ట్…
- దక్షిణ కొరియాలో మంత్రి నారా లోకేష్ పర్యటన.రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ఏపీ ఐటీ, ఎలక్ట్రానిక్స్, విద్యాశాఖ మంత్రి విదేశీ పర్యటన కొనసాగుతోంది. దక్షిణ కొరియా పర్యటనలో దిగ్గజ కంపెనీల ప్రతినిధులతో చర్చలు జరిపారు. మొదట ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఇండియా సీఈఓ హంగ్ జూ జియోన్,హ్యుందాయ్ మోబిస్ తోనూ…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.





Total views : 194669