రేవంత్ రెడ్డి :
యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారిని సీఎం రేవంత్ రెడ్డి దంపతులు దర్శించుకున్నారు. ముఖ్యమంత్రి హోదాలో తొలిసారిగా గుట్టకు వచ్చిన రేవంత్ రెడ్డికి ఆలయ సిబ్బంది పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. ఇవాళ్టి నుండి యాదాద్రిలో బ్రహోత్సవాలు ప్రారంభం కాగా.. బ్రహ్మోత్సవాల తొలిరోజున సతీ సమేతంగా యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామికి పట్టువస్త్రాలు సమర్పించి సీఎం రేవంత్ ప్రత్యేక పూజలు చేశారు. పూజల అనంతరం సీఎం దంపతులకు ఆలయ పండితులు వేదాశీర్వచనం అందించారు. యాదాద్రి పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం భట్టి భట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కొండా సురేఖ, ఎమ్మెల్యేలు బీర్ల అయిలయ్య, కుంభం అనిల్ కుమార్, వేముల వీరేశం, మందుల సామేల్, బీఎల్‌ఆర్ తదితర స్థానిక నేతలు ఉన్నారు. యాదాద్రి దర్శనం అనంతరం సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు భద్రాద్రికి వెళ్లనున్నారు. అక్కడ భద్రాద్రి రాముడిని దర్శించుకున్న అనంతరం ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్‌ను లాంఛ్ చేయనున్నారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ ఉద్ఘాటన అనంతరం రెండవసారి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. స్వామి వారికి సిఎం రేవంత్ రెడ్డి దంపతులు పట్టువస్త్రాలు సమర్పించారు. ఫాల్గుణ శుద్ధ పాడ్యమి నుంచి ఫాల్గుణ శుద్ధ ద్వాదశి వరకు 11 రోజులపాటు శ్రీ లక్ష్మి నరసింహస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి బ్రహ్మోత్సవాలు, స్వస్తి పుణ్యహ వాచనంతో శాస్త్రోక్తంగా ఆరంభమై, ఈ నెల 21వ తేదీ అష్టోత్తర శతఘటాభిషేక పూజలతో ముగుస్తాయి. కాగా ఈ నెల 17న స్వామివారి ఎదుర్కోలు, 18న స్వామివారి తిరు కళ్యాణ మహోత్సవం, 19న స్వామివారి దివ్య విమాన రథోత్సవం నిర్వహిస్తారు.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి