మదనపల్లి (madanapally)లో క్రూర మృగాలు లాగా కొందరు యువకులు మారిపోతున్నారు. పట్టపగలే మదనపల్లి ఇందిరా నగర్ మెట్రో కాంప్లెక్స్ సర్కిల్ (Indira gandhi metro complex circle) వద్ద స్థానిక జడ్పీ హైస్కూల్లో పదవ తరగతి చదువుతున్న ఓ మైనర్ విద్యార్థి పై పలువురు యువకులు ఇనుప రాడ్లు, బెల్టులతో పైశాచిక దాడికి పాల్పడి తీవ్రంగా కొట్టారు. స్థానికులు వారిస్తున్న వినకుండా చావ బాధారు. ఇది ఇక్కడ షర మామూలయింది. కొందరు యువకులు క్రూర మృగాల కన్నా దారుణంగా తయారై మదనపల్లి లో ఇలాంటి దాడులు తెగ రెచ్చి పోయి చేస్తున్నారు. ఇలా ఒకటా రెండా, కోమిటి వాని చెరువు ఉన్న ఓ కళాశాల ముందు జరిగిన దాడిలో ఓ విద్యార్థి అవిటివాడు అయ్యాడు. బయటకు చెప్పుకోలేక ఇంటికే పరిమితమయ్యాడు. రామారావు కాలనీలో కొందరు ఓ విద్యార్థినిని కొట్టడంతో అతనికి కులం అడ్డొచ్చింది. సంఘాల బెదిరింపులకు భయపడి కేసులు పెట్టలేదు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
ఇది చదవండి: నాలుగో విడత వైఎస్సార్ చేయూత చెక్కుల పంపిణీ…
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి