మున్సిపల్ కౌన్సిల్ సమావేశం :
వర్క్ టెండర్ ఖరారు కాకుండానే మెటీరియల్ ని దిగుమతి చేసిన ఘటనపై పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో రసాభాస కొనసాగింది. మున్సిపల్ పరిధిలో శానిటేషన్ కు సంబంధించిన మెటీరియల్ సప్లై కు స్థానిక మున్సిపల్ వార్డు కౌన్సిలర్ భర్త జి సత్తిబాబు కు కాంట్రాక్ట్ అప్పగించేందుకు మున్సిపల్ చైర్మన్ కమిషనర్ లు అప్పటికప్పుడు అత్యవసర తీర్మానాన్ని తీసుకురావడంపై స్వపక్షం కౌన్సిలర్లు మండిపడ్డారు. తమకు కౌన్సిల్లో సరైన గుర్తింపు లేకపోవడం అప్పటికప్పుడు అత్యవసర నోటీసులు ఇవ్వడం ఏమిటని కౌన్సిలర్లు మండిపడ్డారు. నర్సాపురం పట్టణంలోని పారిశుద్ధ్య పనులకు వినియోగించే సామాగ్రిని సప్లై చేసేందుకు జి సత్తిబాబు అనే కాంట్రాక్టర్కు 385 వేలకు కాంట్రాక్టు విధానం సప్లై చేసేందుకు అధికారులు కౌన్సిల్దార్స్ కౌన్సిల్ సభ్యులకు అత్యవసర సమావేశ ప్రకటనను ఇవ్వడంపై పలు అనుమానాలకు తావిస్తోంది. టెండరు తనకు ఖరారు కాకముందే సదరు వ్యక్తి మెటీరియల్ను మునిసిపల్ సిబ్బందికి అందించడం పట్ల పలు విమర్శలు ఎదురవుతున్నాయి.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
అధికారులు ప్రజాప్రతినిధులు కుమ్మక్కై మున్సిపాలిటీ పరిధిలో జరిగే వర్కులన్నీ కాంట్రాక్టర్లతో ఒప్పందం కుదుర్చుకొని ఇష్టారాజ్యంగా ఇచ్చేస్తున్నారని కొందరు కౌన్సిలర్లు పరోక్షంగా ఆరోపిస్తున్నారు. కేవలం నాలుగు లక్షల వర్క్ లోనే ఈ విధంగా జరిగితే ఈ సదరు కాంట్రాక్టర్ పట్టణంలో అనేక మేజర్ వర్కులు చేస్తున్నాడని అవన్నీ కూడా అధికారులు ప్రజాప్రతినిధులు తనకు కావలసినట్టు కేటాయిస్తుండడం రాజకీయ రంగు పూలముకున్నదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. కాంట్రాక్టు తనకు ఖరారు కాకుండానే మెటీరియల్ మున్సిపల్ సిబ్బందికి ఎలా అప్పగిస్తారని కౌన్సిలర్లు ప్రశ్నిస్తున్నారు. దీనిపై మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వరరావు చైర్ పర్సన్ బర్రె శ్రీ వెంకటరమణ మీడియా వివరణ కోరగా ఇరువురు పొంతనలేని సమాధానాలు చెప్పడంతో మున్సిపాలిటీ పరిధిలో జరిగే వర్కుల్లో కాంట్రాక్టర్లు కాంట్రాక్టులు ఎలా దక్కించుకుంటున్నారో అర్థమవుతుంది. మున్సిపాలిటీలో ఇప్పటివరకు జరిగిన అన్ని వర్కులపై ఉన్నతాధికారులు కల్పించుకుని విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి