షుగర్ ఫ్యాక్టరీ మూతకు బీజేపీయే కారణమని కాంగ్రెస్ పార్టీ(Congress Party) ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి(MLC Jeevan Reddy) మండిపడ్డారు. ప్రధాని నరేంద్ర మోదీ(Narendra Modi) వేషం ఇప్పటికి రెండుసార్లు చూశామని విమర్శించారు. జగిత్యాల సభలో ఆయన అన్నీ అబద్దాలే చెప్పారని మండిపడ్డారు. పసుపు సాగు పట్ల రైతులకు నమ్మకం లేదని పసుపుకు కనీస మద్దతు ధర మోదీ ఇవ్వడం లేదని ఆరోపించారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
పసుపు బోర్డు ఏర్పాటు డిమాండ్ ఎప్పటి నుంచో ఉందని చెప్పారు. పదేళ్లు అధికారంలో ఉన్నది మీరే కదా మళ్లీ ఇప్పుడు షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తామని అంటారేమిటని నిలదీశారు. ఇన్నాళ్ళు షుగర్ ఫ్యాక్టరీని ఎందుకు ఓపెన్ చేయలేదో చెప్పాలన్నారు. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ అయిదేళ్లు ఏం చేశారు? అని ప్రశ్నించారు.
ఇది చదవండి: దక్షిణాదిలో కొన్ని రోజులుగా మోదీ సుడిగాలి పర్యటనలు…
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి