శ్రీకాళహస్తి (Srikalahasti):
రాష్ట్రంలో ఎన్నికల నగారా మోగింది. ప్రధాన పార్టీల అభ్యర్థులు కూడా ఖరారయ్యారు. అందరూ ప్రచారంలో మునిగి తేలుతున్నారు.ఇందులో
శ్రీకాళహస్తి (Srikalahasti) నియోజక వర్గంలో వైసిపి (YCP), టిడిపి (TDP) అభ్యర్థులు ప్రధానంగా పోటీలో ఉన్నారు. వైసిపి కి చెందిన స్థానిక ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి (Biyyapu Madhusudhan reddy) ముచ్చటగా మూడోసారి ఫ్యాన్ గుర్తుపై పోటీ చేస్తున్నారు. టిడిపి అభ్యర్థి సుధీర్ రెడ్డి రెండోసారి తన సత్తా నిరూపించుకోవడానికి సిద్ధమయ్యారు. అదేవిధంగా వైసిపి ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ఉంది. కేవలం సంక్షేమానికి ప్రాధాన్యత ఇచ్చారు అనే ఆరోపణలు ఉన్నాయి. బియ్యపు మధుసూదన్ రెడ్డి 2019లో ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత ఆయనకు అండగా నిలిచిన మండల స్థాయి నాయకులలో ఎక్కువ మంది ఆయనకు అందుబాటులో లేరు. పార్టీ గుర్తించిన 23 మంది నాయకుల్లో కొందరు మాత్రమే ఆయనతో ఉంటున్నారు. అదే విధంగా అసమ్మతి పెరగడంతో టిడిపికి తిరిగి వెళ్లిపోయిన వారు ఉన్నారు. మాజీ ఎమ్మెల్యేలు ముని రామయ్య, ఎస్సీవి నాయుడు టిడిపిలోకి వెళ్ళిపోయారు. అంతే కాకుండా వైసిపి తరఫున గెలిచిన ఇద్దరు జెడ్పిటిసిలు కూడా ఇటీవల పార్టీ మారారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
రేణిగుంట మండలానికి చెందిన కీలక నేత సుధాకర్ రెడ్డి కూడా త్వరలో పార్టీ మారనున్నారు అంటూ ప్రచారం జరుగుతుంది. మండల స్థాయి నాయకులకు, ఎన్నికల్లో గెలిచిన వారికి ప్రాధాన్యత ఇవ్వక పోవడం.. కుటుంబ సభ్యుల జోక్యం ఎక్కువ కావడం తదితర కారణాల వల్ల ఎక్కువ మంది నాయకులు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఇది ఇలా ఉండగా టిడిపిలో సీనియర్ నాయకులు మాజీ ఎమ్మెల్యే ఎసివి నాయుడు, సత్రవాడ ముని రామయ్య కొంతమంది నాయకులతో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేసి టిడిపి బొజ్జల సుధీర్ రెడ్డి పై ఎస్ సి వి నాయుడు అసంతృప్తి వ్యక్తం చేశారు. శ్రీకాళహస్తి టిడిపి అభ్యర్థత్వం పై మరోసారి పునః పరిశీలన చేయాలని మాజీ ఎమ్మెల్యే ఎస్ సి వి నాయుడు టిడిపి అధినేత చంద్రబాబు నాయుడును కోరారు. తన సీనియార్టీ వయసు ఎమ్మెల్యేగా తాను చేసిన అభివృద్ధి పరిగణలోకి తీసుకొని పున పరిశీలన చేయాలన్నారు.
మాజీ ఎమ్మెల్యే ముని రామయ్య తో పాటు తమ అనుచర వర్గానికి న్యాయం జరిగేలా చంద్రబాబు నాయుడు (Chandra babu Naidu) నుంచి స్పష్టమైన హామీ లభించాలని ప్రస్తుతం జరుగుతున్న అరాచక దోపిడీ పాలనలు భవిష్యత్తులో రాకూడదనిదే తమ అభిమతమని ఎస్ సి వి నాయుడు అన్నారు. తన వయసు సీనియార్టీ ఎమ్మెల్యేగా తాను చేసిన అభివృద్ధి, ప్రస్తుతం నియోజకవర్గంలో ఉన్న పరిస్థితులను పరిగణలోకి తీసుకొని అభ్యర్థత్వంపై మరోసారి పునః పరిశీలన చేసి తనకు టిడిపి అభ్యర్థిగా అవకాశం కల్పించాలని అభ్యర్థించారు. తనను ప్రస్తుత అభ్యర్థి బొజ్జల సుధీర్ రెడ్డి కలిసినప్పుడు కూడా తాను స్పష్టంగా చెప్పానని పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కలిసి తనకు తన వర్గానికి న్యాయం చేసేలా హామీ పొందాల్సి ఉంది అని స్పష్టం చేశామని తెలిపారు. పార్టీ నిర్ణయం అందరికీ శిరోధార్యం అని అయితే తాను మరోసారి శ్రీకాళహస్తి అభ్యర్థి తత్వం పై చంద్రబాబునాయుడు పున పరిశీలన చేసి మరోసారి సర్వే చేసి అభ్యర్థిని ఖరారు చేయాలని కోరుతున్నామన్నారు.
శ్రీకాళహస్తి సత్యవేడు, తిరుపతి నియోజకవర్గాల్లో పార్టీ అభ్యర్థుల ప్రకటనపై పార్టీ నాయకులు కార్యకర్తలు లో తీవ్ర అసంతృప్తి నెలకుందని, స్థానిక పరిస్థితులు గందరగోళం గా మారాయిని వీటిని అన్నిటినీ పరిగణలోకి తీసుకొని టిడిపి అధినేత పార్టీలో గెలుపు అవకాశాలు ఎక్కువగా వారికి టికెట్లు ఇచ్చే విధంగా పున పరిశీలన చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. తనకు ప్రజలు ఎమ్మెల్యేగా అవకాశం కల్పిస్తే 38 వేల ఇల్లు, 40 వేల ఇంటి పట్టాలు పంపిణీ చేశామని, సుమారు 2 వేలు పైగా గుళ్ళు నిర్మాణానికి ఆర్థిక సహాయం అందించామని, ప్రజలకు నిరంతరం సేవ చేసి నాలుగు నియోజకవర్గాల్లో ప్రజల ఆధార అభిమానం సంపాదించుకున్నామన్నారు. వైసీపీ పాలనలో అరాచక దోపిడీ దౌర్జన్యాలతో ప్రజలకు భద్రత లేకుండా పోయిందని, గుళ్ళు, గోపురాలు సర్వనాశనమై దేవుడే ఉండలేని పరిస్థితులు తీసుకొచ్చారని, భవిష్యత్తులను ఇలాంటి పరిస్థితులు రాకుండా ప్రజలకు, పార్టీ నాయకులకు భరోసా కల్పిస్తూ ప్రజల ఆదరభిమానాలు మెండు గా ఉన్న నాయకులకు టికెట్లు ఇచ్చి పార్టీని గెలిపించుకోవాల్సిన ఆవశ్యకత అధిష్టానం గుర్తించి తగిన నిర్ణయం తీసుకోవాలని ఎస్ సి వి నాయుడు కోరారు.
ఇది చదవండి: కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శించుకున్న నారా లోకేష్..
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి