పంట నష్టం జరిగిన రైతులందరికి పరిహారం చెల్లించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మంత్రి జూపల్లి కృష్ణారావు (Jupalli Krishnarao) అన్నారు. కామారెడ్డి (Kamareddy) జిల్లాలో ఇటీవల వర్షాలకు దెబ్బతిన్న పంటలను ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీతో కలిసి జూపల్లి పరిశీలించారు. బిక్నూర్ మండలం మాసుపల్లి, జంగంపల్లి, దోమకొండా మండలం లింగుపల్లి గ్రామాల్లో పంటల స్థితిగతులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. సీఎం రేవంత్ రెడ్డి పంట నష్టంపై సర్వే చేయాలని అధికారులను ఆదేశించారన్నారు. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారని చెప్పారు. అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు 10వేల చొప్పున నష్టపరిహారం అందించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని చెప్పారు. సర్వే పూర్తికాగానే అధికారుల నివేదిక ప్రకారం రైతులకు ఆర్థికసాయం చేస్తామన్నారు. 4-5 ఎకరాలున్న రైతులకు వారం రోజుల్లో నగదు బదిలీ పూర్తి చేస్తామని మంత్రి జూపల్లి తెలిపారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
ఇది చదవండి: సుప్రీంకోర్టులో కేంద్రానికి ఊరట..
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి