వైద్య వృత్తిలో ఉండే డాక్టర్ (Doctor) ని మనుషులు అందరూ దేవుడితో సమానంగా భావిస్తారు. కానీ కొంతమంది డాక్టర్లు అదే మనుషుల ప్రాణాలతో చెలగాటలాడుతూ మనుషులపాలిట రాక్షసులుగా తయారయ్యారు.
నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో ప్రభుత్వ ఆసుపత్రి ఎదురుగా ఆర్ఎంపీ డాక్టర్ (Doctor) అయినటువంటి సమీర్ కి చెందిన న్యూ లైఫ్ హాస్పిటల్ (New Life Hospital) ఉంది. ఈ హాస్పిటల్ పై గతం నుండి కూడా ఎన్నో కేసులు ఉన్నాయని ఈ ఆర్ఎంపి సమీర్ ఎంతోమంది ప్రాణాలతో చెలగాటం ఆడే విధంగా వైద్యం చేశాడని ఆరోపణలు కూడా ఉన్నాయి. అలాగే నాగర్ కర్నూలు జిల్లా బిజినేపల్లి మండలం గుడ్ల నర్వ గ్రామానికి చెందిన వట్టెపు అరవింద్ కు కిడ్నీ సమస్య ఉండడంతో సమీర్ కి చెందిన న్యూ లైఫ్ హాస్పిటల్ కి వెళ్ళాడు. అక్కడ అరవింద్ ను చూసిన శమీ కిడ్నీ సంబంధిత రోగాలకు తను నాటు వైద్యం చేస్తానని, ఇంద్రకల్ గ్రామ సమీపంలో గల తన గెస్ట్ హౌస్ దగ్గరికి రావాలన్నారు. అక్కడికి వెళ్లిన అరవింద్ కి ఏదో పసరు తాపి ఒక అరటిపండు తినిపించి ఇలా ప్రతి వారం రావడం వల్ల నీకు పూర్తి గా నయమవుతుందని మాయమాటలు చెప్పి పంపించాడు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
అనారోగ్యం నుంచి కుదుటపడతాననే ఆశతో ఇంటికి వెళ్లిన అరవింద్ కు చేదు అనుభవం ఎదురయింది. కిడ్నీ సమస్య తక్కువ కావడం పక్కకు పెడితే 62 కిలోలు ఉన్న అరవింద్ 3 వారాల్లోనే 35 కిలోల బరువుకు తగ్గిపోయాడు. బరువు తగ్గడంతో పాటు శరీరం మొత్తం పగుళ్లు ఏర్పడి చర్మం మొత్తం పాము చారల్లాగా మారిపోయింది. అప్పటివరకు తన పని తాను చేసుకుంటూ ట్రీట్మెంట్ కి వెళ్తున్న అరవింద్ ఒక్కసారిగా మంచం పాలైపోయాడు. ఇద్దరు వ్యక్తులు సహాయంతో మాత్రమే నడిచే విధంగా తయారయ్యాడు. తను ఇలా కావడానికి కారణమైన ఆర్ఎంపీ డాక్టర్ సమీర్ ని శిక్షించాలని నాలా ఇంకెవరికి జరగకూడదని ఆవేదనతో ఈ రోజు నాగర్ కర్నూల్ పోలీస్ స్టేషన్లో ఆర్ఎంపీ సమీర్ అతని హాస్పిటల్ పై కేసు నమోదు చేయడానికి వచ్చిన అరవింద్ మాట్లాడుతూ నా కిడ్నీ సమస్య పరిష్కరిస్తానని నాటు వైద్యంతో నా జీవితంతో చెలగాటమాడిన సమీని ప్రభుత్వ అధికారులు, ఉన్నతాధికారులు శిక్షించి ఆయన హాస్పిటల్ ను రద్దు కూడా చేయాలని కోరారు.
ఆర్.ఎం.పి సమీర్ చేతుల్లో పూర్తిగా ఆరోగ్యం క్షీణింప చేసుకున్న అరవింద్ కు మద్దతుగా బిఎస్పి శ్రేణులు పోలీస్ స్టేషన్ కు వచ్చారు. బీఎస్పీ నాయకులు పృథ్వి మాట్లాడుతూ గతంలో కూడా ఈ ఆర్ఎంపి సమీర్ పై ఎన్నో ఆరోపణలు ఉన్న మాట వాస్తవమేనని, ఇప్పటికీ హాస్పిటల్లో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారని అయినా అధికారులు నిమ్మకు నీరు ఎత్తన్నట్టు వివరిస్తున్నారని అన్నారు. ఇప్పటికైనా అధికారులు వెంటనే స్పందించి అతనికి శిక్ష పడేలా చేయాలని అన్నారు. అదేవిధంగా క్లినిక్ ని సీజ్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని లేకుంటే బీఎస్పీ తరఫున న్యూ లైఫ్ క్లినిక్ ముందు ధర్నాలు చేపడతామని హెచ్చరించారు.
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి