ప్రకాశం (Prakasam)..
మార్కాపురం మున్సిపాలిటీ పరిధిలోని పలు కాలనీ లలో నీరు లేక కాలనీ వాసులు లబో దిబో మంటున్నారు. ప్రజాప్రతినిధులు ఓట్లు అడగడానికి మా కాలనీలోకి వస్తున్నారు గాని నీటి సమస్య ఉందని చెప్తున్నా ఎవరు పట్టించుకోవడంలేదని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాగర్ నీరు రాక ఇప్పటికీ 20 రోజులు అయిందని మున్సిపల్ అధికారులకు అడిగితే పైపులు పగిలిపోయాయని సాకులు చెబుతున్నారని, మున్సిపల్ పరిధిలోని బోర్ల లో నీరు అందటం లేదని కొన్ని మోటర్లు కాలిపోగా వాటి గురించి మున్సిపల్ అధికారులు పట్టించుకోవడంలేదని కాలనీవాసులు ఆందోళన చెందుతున్నారు. మున్సిపాలిటీ ప్రజాప్రతినిధులు వాటర్ ట్యాంకులు పెట్టి 15 రోజులకు ఒకసారి పంపిస్తున్నారని ఆ నీరు సరిపోక ఎక్కడ తెచ్చుకోవాలో అర్థం కాక అల్లాడి పోతున్నామని కాలనీవాసులు తెలిపారు. మాకు తక్షణమే నీటి సమస్య లేకుండా చేయాలని అధికారులను కోరారు. రాజకీయ నాయకులు మా కాలనీలోకి ప్రచారానికి వస్తే నిలదీస్తామని తెలిపారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
ఇదిచదవండి: అత్తాపూర్ లో విషాదం.. కారు చక్రాల కింద పడి నలిగిపోయిన పసికందు…
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి