రిజర్వాయర్లలో నీటి(Water) నిల్వలు పడిపోవడంతో ప్రజలు ఆందోళన..
దేశానికి తాగునీటి గండం పొంచి ఉంది. రిజర్వాయర్ల(Reservoirs)లో నీటి నిల్వలు పడిపోవడం ఆందోళన కలిగిస్తుంది. ఇప్పటికే తీవ్ర నీటి ఎద్దడితో సతమతమవుతున్న బెంగళూరు(Bangalore) దుస్థితి దేశానికి మొత్తం రానున్నదా అనే భయం ప్రజల్లో నెలకొంది. నిరుడు వర్షాభావ పరిస్థితులతో భూగర్భ జలాలు అడుగంటి పోవడం ఇందుకు కారణమని సంబంధిత అధికారులు చెప్తున్నారు. తాగునీటి అవసరాలు రోజురోజుకు పెరుగుతుంటే అందుకు భిన్నంగా రిజర్వాయర్లలో నీటి మట్టాలు తగ్గిపోతున్నాయి.
దేశ వ్యాప్తంగా ఉన్న 150 రిజర్వాయర్లలో 38 శాతం మాత్రమే నీటి నిల్వలు..
దేశ వ్యాప్తంగా ఉన్న 150 రిజర్వాయర్లలో నీటిమట్టం మొత్తం సామర్థ్యంలో 38 శాతం మాత్రమే ఉండటం ఆందోళన కలిగిస్తున్నది. ఇది దశాబ్దపు సగటుకంటే తక్కువ కావడం రాబోయే నీటిగండం ముప్పును సూచిస్తున్నది. దక్షిణాది రాష్ట్రాల్లోని రిజర్వాయర్లలో వాటర్ స్టోరేజీ దారుణంగా పడిపోతున్నట్లు సెంట్రల్ వాటర్ కమిషన్ తెలిపింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో మొత్తం 42 ప్రాజెక్టులుండగా వీటి స్టోరేజీ కెపాసిటీ తగ్గుముఖం పట్టింది. దీంతో ఈ వేసవిలో బెంగళూరు తరహా నీటి ఎద్దడి తప్పకపోవచ్చని అధికారులు భావిస్తున్నారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
ఇది చదవండి: భగవంత్ సింగ్ మాన్ కీలక వ్యాఖ్యలు..!
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి