తేరా చిన్నపరెడ్డి(Tera Chinnapareddy) రాజీనామా చేస్తూ కేసీఆర్ కు లేఖ..
తెలంగాణ(Telangana)లో ప్రతిపక్ష బీఆర్ఎస్(BRS)కు వరుస దెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే పలువురు నేతలు పార్టీకి గుడ్‌బై చెప్పేశారు. తాజాగా మాజీ ఎమ్మెల్సీ తేరా చిన్నపరెడ్డి పార్టీని వీడారు. బీఆర్ఎస్ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తూ కేసీఆర్(KCR) కు లేఖ పంపారు. నల్గొండ లోక్‌సభ స్థానాన్ని ఆశించిన ఆయన.. ఆ స్థానానికి కంచర్ల కృష్ణారెడ్డి పేరు ప్రకటించిన తర్వాత రాజీనామా లేఖను బయటపెట్టడం గమనార్హం. చిన్నపరెడ్డికి బీజేపీ నుంచి ఆహ్వానాలు అందుతున్నట్టు సమాచారం.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
హుజూర్‌నగర్(Huzurnagar) మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత సైదిరెడ్డి(Saidireddy)ని పార్టీలో చేర్చుకున్న బీజేపీ(BJP).. ఆయనను నల్గొండ ఎంపీ స్థానం నుంచి బరిలోకి దింపుతోంది. ఆయన అభ్యర్థిత్వాన్ని కమలం పార్టీ నేతలు వ్యతిరేకిస్తుండడంతో ఇప్పుడా స్థానాన్ని చిన్నపరెడ్డికి కేటాయించి, సైదిరెడ్డికి మరో స్థానం కేటాయించాలని బీజేపీ అధిష్ఠానం యోచిస్తున్నారు. ఆ హామీతోనే చిన్నపరెడ్డి బీఆర్ఎస్‌ను వీడినట్టు ప్రచారం జరుగుతోంది. ఒకటి, రెండు రోజుల్లో భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తానని చిన్నపరెడ్డి తెలిపారు.
ఇది చదవండి: 46 మందితో కాంగ్రెస్ పార్టీ నాలుగో జాబితా విడుదల..
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి