వెజిటేరియన్ ఫుడ్స్ లో ప్రోటీన్ పవర్(Vegetarian protein)!
మాంసం తినకుండా కూడా శరీరానికి అవసరమైన ప్రోటీన్ అందించటం సాధ్యమే! శాకాహారంలో ఎక్కువగా ప్రోటీన్ ఉండే ఆహారాల గురించి తెలుసుకుందాం.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
పెసరపప్పు ఇది ఒక అద్భుతమైన ప్రోటీన్(Protein) స్టోర్ హౌస్. 100 గ్రాముల పెసరపప్పులో 24 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. ఇది ఫైబర్, ఐరన్, పొటాషియం, మెగ్నీషియం వంటి పోషకాలకు కూడా మంచి సోర్స్. కందిపప్పు 100 గ్రాముల కందిపప్పులో 21 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. ఇది డయాబెటిస్ నియంత్రణకు, గుండె ఆరోగ్యానికి మంచిది. కొర్రలు 100 గ్రాముల కొర్రల్లో 22 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. ఇవి ఫైబర్, ఐరన్, కాల్షియం, యాంటీఆక్సిడెంట్లకు మంచి మూలం. చిక్కుళ్ళు(బీన్స్)100 గ్రాముల చిక్కుళ్ళు 19 గ్రాముల ప్రోటీన్ కలిగి ఉంటాయి. ఇవి ఫైబర్(Fiber), ఐరన్, పొటాషియం, మెగ్నీషియం, విటమిన్ B లకు మంచి సోర్స్. బచ్చలికూర 100 గ్రాముల బచ్చలికూర 2.9 గ్రాముల ప్రోటీన్ కలిగి ఉంటుంది. ఇది ఐరన్, కాల్షియం, విటమిన్ A, C లను కలిగి ఉంటుంది. బ్రోకలీ 100 గ్రాముల బ్రోకలీ 2.8 గ్రాముల ప్రోటీన్ కలిగి ఉంటుంది. ఇది ఐరన్, కాల్షియం, విటమిన్ C, K లను కలిగి ఉంటుంది.
పాలలో కూడా మంచి ప్రోటీన్ ఉంటుంది 100 గ్రాముల పాలలో 3.4 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. ఇది కాల్షియం, విటమిన్ D లను కలిగి ఉంటుంది. పెరుగు100 గ్రాముల పెరుగులో 10 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. ఇది కాల్షియం, ప్రోబయోటిక్స్ కు మంచి మూలం. పనీర్ 100 గ్రాముల పనీర్లో 21 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. ఇది కాల్షియం, విటమిన్ B12ను అధికంగా కలిగి ఉంటుంది. బాదం 100 గ్రాముల బాదం 21 గ్రాముల ప్రోటీన్ కలిగి ఉంటుంది. ఇది ఫైబర్, ఐరన్, మెగ్నీషియం, విటమిన్ E ను అధికంగా కలిగి ఉంటుంది.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి